Home / Latest Alajadi / ట్రాఫిక్ చలనాలపై డిస్కౌంట్ ప్రకటించిన పోలీస్ శాఖ

ట్రాఫిక్ చలనాలపై డిస్కౌంట్ ప్రకటించిన పోలీస్ శాఖ

Author:

ఇది అసలే దసరా సీజన్ కావడంతో  అన్ని కంపెనీలు బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. మరి మేము ఇందులో తక్కువ ! అనుకున్నారో ఏమో మన పోలీసులు, వారు కూడా ఒక బంపర్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు. పోలీసువారు ప్రకటించిన ఆఫర్ ఏమిటో తెలుసా! పెండింగ్ చలాన్ల ఆఫర్… అంటే పెండింగ్ లో ఉన్న వాహనాల చలాన్లను ఈ  నెల 5,6,7 తేదీలలో చెల్లించాలి. అలాగే ఇందులో మనకు కొద్దిగా  మినహాయింపు కూడా ప్రకటించారు. హైదరాబాద్ లో వాహనాల చలాన్లు చాలా ఎక్కువ అయినా ఎప్పటికప్పుడు వసులు చేస్తున్న, చెల్లించవలసిన చలాన్లు చాలా ఉన్నాయి. అందుకే ఆఫర్ ప్రకటించినట్టు నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ జితేందర్ తెలియజేశాడు.

hyderabad-traffic-police-offer

మూడు రోజులపాటు గోషామహల్ స్టేడియంలో లోక్ అదాలత్ ఏర్పాటు చేశారు అందులో భాగంగానే ఆఫర్ ప్రకటించారు. అలాగే రెండు, మూడు సంవత్సరాల చలానాలు చెల్లించని వారిపై కోర్టు కేసులు చాలా ఉన్నాయి. అలాంటి కేసులు లోక్ అదాలత్ లో పరిష్కారం ఉంటుంది  అంటున్నారు పోలీసులు. మొండి బకాయిలను వసూళ్లు చెయ్యడానికి ఇలాంటి ఆఫర్ అనుకున్న ఇందులో చాలను రేటును బట్టి 30 నుండి 50 శాతం వరకు మినహాయింపు ఇవ్వడం చాలా ప్రత్యేకత సంతరించుకుంది.

(Visited 1,277 times, 1 visits today)