Home / Inspiring Stories / ఒక్కో చుక్కా ఒడిసిపట్టి ఎడారిని పచ్చగా మార్చేశాడు.

ఒక్కో చుక్కా ఒడిసిపట్టి ఎడారిని పచ్చగా మార్చేశాడు.

Author:

దేశవ్యాప్తంగా నీటి కొరత తీవ్రమవుతున్న విషయం తెలిసిందే. వాతావరణంలో సంభవిస్తున్న పెను మార్పులు, ఓజోన్ పొర దెబ్బతినడం వలన అయితే అతివృష్టి, లేదఒటే అనావృష్టి అనే పరిస్థితి దాపురించింది. ఇక హిమాలయ పరిసర ప్రాంతాల్లో అయితే మరీ దారుణంగా ఉంది పరిస్థితి. లడక్ లాంటి ప్రాంతాల్లో ఒక్కోసారి ధారాళంగా వరదలు వెల్లువెత్తుతుంటే , ఇఒకోసారి గ్లేసియర్లు కరిగిపోయి చుక్క నీరు కూడా లేకుండా కరువు కాటేస్తోంది. అంటే ఒకే ప్రాంతంలో కొంతకాలం నీటి వరదలు, తుఫాన్లు..మరి కొంత కాలం నీరేలేని కరువు..ఎంత దారుణమైన మార్పు..అయితే వాతావరణంలో జరిగే మార్పుల వల్ల సహజ దేశ సరిహద్దులైన హిమాలయాలు కరిగిపోతున్నాయని, దీనివల్ల కరువు, తుపాన్లు వచ్చే అవకాశముందని అనేక అంతర్జాతీయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ ప్రమాదం నుఒచి మనల్ని మనం కాపాడుకునే అవకాశముందని ఓ యువ శాస్త్రవేత్త భరోసా ఇస్తున్నాడు. సోనమ్ వాంగ్‌చుక్ అనే ఇంజనీర్ తన ఆలోచనలను మదించి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఎడారిలా మారుతోన్న ప్రాంతాన్ని తన అవిష్కరణలతో పచ్చని పంట పొలాల్లా మార్చేస్తున్నాడు. అదెలాగో తెలుసుకుందాం…

హిమాలయాల్లో గ్లేసియర్లు కరిగిపోవడంతో లడఖ్ పరిసర ప్రాంతాల్లో నీరు లేకుండా కరువు ప్రాంతంగా మారిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే ఎడారి ప్రాంతఒగా మారిపోయింది. దీన్ని సోనమ్ వాంగ్‌చుక్ ఇప్పుడు ఓ కృతిమ హిమనదీ ప్రాంతంగా మార్చేశాడు. భారీ మంచు స్థూపాలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నాడు. వరదల సమయంలో పైప్ లైన్ల ద్వారా నీటిని లోతట్టు ప్రాంతాల్లోకి మళ్ళించి పైకి వేదజల్లెలా ఒక స్థూపం ఏర్పాటు చేశాడు. పైకి చిమ్మిన నీరు చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలో మంచులా మారీ కొన్ ఆకారంలో ఓ మంచు స్థూపంలా మారుతుంది. ఈ స్థూపఒ కోన్ రూపంలా ఉండడం వల్ల దీనిలోని మంచు కరగదు..నీరు వృధా అవ్వదు. ఆ మంచు స్థూపఒ వేసవిలో కరిగి నీరుగా మారుతుంది.. ఇలా హిమాలయ ప్రాంతం నుంచి తాము ఉండే గ్రామం వరకు మంచినీటితో కూడిన భారీ పైప్‌లైన్ వేసిన ఈ ఇంజనీర్, మంచుకరుగుతున్న కొద్దీ, అది నీటిగా మారేలా ఎర్పాటు చేశాడు. ఇలా ఒక్కో చుక్కా ఒడిసిపట్టి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాడుకునే ఆవిష్కరణతో వింటర్ నుంచి సమ్మర్ దాకా తమ గ్రామస్థులకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించాడు.

ఇలా ఒక్కో చుక్కా ఒడిసిపట్టి సరికొత్త ఆవిష్కరణకు ప్రాణం పోసిన సోనమ్ కు పలు అవార్డులు రివార్డులు కూడా వచ్చాయి. గత ఏడాది రోలెక్స్ అవార్డ్ ని కైవసం చేసుకున్నాడు. దాంతో తనకు వచ్చిన లక్ష డాలర్లు ప్రైజ్ మనీని కూడా మరో 20 మంచు స్థూపాల ఏర్పాటుకోసం, లడఖ్‌లో చెట్లు నాటడానికి కేటాయించాడు. దీనిద్వారా గ్రామస్తులకు కనీసం కోటి లీటర్ల నీరు లభిస్తుందని అంటున్నాడు. తన ఆలోచనలతో ఇతరులకు మంచి చేస్తున్న సోనమ్ కు అలజడి తరపున శుభాకాంక్షలు.

(Visited 102 times, 1 visits today)