Home / Entertainment / ఐఫా అవార్డ్స్ లో స్టార్స్ v/s టాలెంట్

ఐఫా అవార్డ్స్ లో స్టార్స్ v/s టాలెంట్

Author:

iifa

ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ చిత్రాలకు సంబంధించిన అవార్డుల వేడుక హైదరాబాద్‌లో నిర్వహించబోతోంది. డిసెంబర్ 4 నుండి మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో ఇప్పటికే తెలుగు విభాగం ఫంక్షన్ కు హోస్ట్‌గా వ్యవహరించేందుకు అల్లు శిరీష్ అంగీకరించి ఓ సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే, రామ్ చరణ్ ఈ ఫంక్షన్‌లో స్టేజ్‌పై డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతుండటం.

ఐతే ఈ అవార్డులు ఫాన్స్ ఓటింగ్ నీ బట్టి ఇస్తారా! లేకా టాలెంట్ నీ బట్టి ఇస్తార! అన్నది చేప్పలేము ఎందుకంటే ఇదివరకు చాలా మందికి టాలెంట్ ఉన్న వారికి రాకుండా స్టార్ గా చేప్పుకు తిరుగే వారికి ఇచ్చిన సందర్బాలు అనేకం చుశాము మళ్ళి ఇప్పుడు ఐఫా బరిలో పలువురు స్టార్ డైరెక్టర్లతో పాటు పలువురు కొత్త దర్శకులు కూడా పోటీ పడుతున్నారు. ఉత్తమ దర్శకుడి పురస్కారం విభాగంలో స్టార్ డైరెక్టర్లు రాజమౌళి(బాహుబలి), పూరి జగన్నాథ్(టెంపర్), కొరటాల శివ(శ్రీమంతుడు) తో పాటు కొత్తగా వచ్చిన ఒక్క సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన కార్తికేయ దర్శకుడు చందు మొండేటి పోటీ పడుతున్నాడు. మొత్తం టాలీవుడ్ నుంచి 5 సినిమాలు పోటీపడుతున్నాయి. అందులో ఒకటి బాహుబలి, మరొకటి శ్రీమంతుడు కాగా మరొకటి పాఠశాల అనే చిన్న సినిమా,ఇక మిగతా రెండూ సినిమాలు నాని నటించినవే ‘భలేభలే మగాడివోయ్’, ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలు ఐఫా అవార్డుల రేసులో పోటీపడుతున్నాయి.

ఉత్తమ నటుడు విభాగంలో ప్రభాస్ (బాహుబలి), నాని (భలే భలే మగాడివోయ్), మహేష్ బాబు (శ్రీమంతుడు), అల్లు అర్జున్ (సన్నాఫ్ సత్యమూర్తి), జూ ఎన్టీఆర్ (టెంపర్) పోటీ పడుతున్నారు. ఉత్తమ నటి విభాగంలో మంచు లక్ష్మి (దొంగాట), తమన్నా (బాహుబలి), లావణ్య త్రిపాటి (భలే భలే మగాడివోయ్), నిత్యా మీనన్ (మళ్లీ మళ్లీ ఇది రాని రోజు), శృతి హాసన్ (శ్రీమంతుడు) పోటీ పడుతున్నారు. ఉత్తమ హస్యనటుడు విభాగంలో వెన్నెల కిషోర్ (భలే భలే మగాడివోయ్), బ్రహ్మానందం (దొంగాట), వెన్నెల కిషోర్ (శ్రీమంతుడు), శ్రీనివాస రెడ్డి (పటాస్), భద్రం (జ్యోతి లక్ష్మి) పోటీ పడుతున్నారు. ఉత్తమ ప్రతి నాయకుడు అవార్డుకు రానా(బాహుబలి), ప్రభాకర్ (దొంగాట), కబీర్ సింగ్ (జిల్), అజయ్ గోష్ (జ్యోతి లక్ష్మి), సంపత్ (శ్రీమంతుడు) పోటీ పడుతున్నారు. ఉత్తమ సంగీత దర్శకుడు విభాగంలో ఎంఎం కీరవాణి (బాహుబలి), రఘుకుంచె, సాయికార్తీక్, సత్యమహవీర్(దొంగాట), దేవిశ్రీ ప్రసాద్(శ్రీమంతుడు), అనుప్ రూబెన్స్(టెంపర్), అనూప్ రూబెన్స్ (గోపాల గోపాల) పోటీ పడుతున్నారు.

(Visited 189 times, 1 visits today)