ఇక పై ప్రభుత్వ ఉద్యోగ నియామకల్లో ఇంటర్వ్యూ ఉండదు సరాసరి కొలువులోకే. ఈ మేరకు రెండు వారాల్లో మార్గ దర్శకలను కూదా విడుదల చేయ్నున్నట్టు చెప్పారు మన ప్రధాని . నిరుధ్యోగులకిది నిజంగా శుభవార్తే ఐతే చిన్న మెలిక ఉందిక్కడ ఈ ఆఫర్ కేవలం కింది స్థాయి ఉధ్యోగాలకేనట. ఆగస్టు పదిహేను స్వతంత్ర వేడుకల్లో ప్రధాని ప్రసంగిస్తూ. “కింది స్థాయి ఉద్యోగాలకు కూడా ఇంటర్వ్యూ లు అవసరమా?” అని ప్రశ్నించిన మోడీ ఆ విషయన్ని అక్కడే మర్చిపోలేదు. తాజా మన్ కీ బాత్ లో ఆయన ఇక నుంచీ కింది స్తాయి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు తొలగించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.
ఇంటర్వ్యూలకు రమ్మని పిలవగానే అభ్యర్థులు ముందు గా సిఫార్సుల కోసమో, లేదా పైరవీల ద్వారా డబ్బు పెట్టి ఐనా ఉద్యోగం సంపాదిద్దాం అనో చూస్తున్నారనీ దీనివల్ల అవినీతికి ఆస్కారం ఏర్పడుతోందనీ ప్రధాని అన్నారు. అందుకనే చిన్న స్థాయి ఉద్యోగాల ఎంపికలో ఇంటర్వ్యూ లు ఎత్తేయ బోతున్నామనీ, ఎంపిక ప్రక్రియను మరింత సరళం చేయ బోతున్నామనీ ఆయన అన్నారు.