Home / Entertainment / ఇక రేటు పెంచి సినిమా చూపిస్తాడట.

ఇక రేటు పెంచి సినిమా చూపిస్తాడట.

Author:

Raj Tarun Photos

వచ్చీనవి రెండు సినిమాలే అయినా క్రేజీ హీరోగా మారడు రాజ్ తరుణ్. పెద్ద దర్శకులతోనూ సినీ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకునే ప్రయత్నాలు తీవ్రంగానే చేస్తున్నాడు. “రేయ్’ సినిమాతో భారీ పరాజయాన్ని చవిచూసిన వైవియస్ చౌదరి దర్శకత్వంలోనూ రాజ్ తరుణ్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ యిచ్చాడు. చాలా కాలంగా కెరీర్లో సరైన హిట్ లేక కష్టాల్లో ఉన్న చౌదరి ‘రేయ్’ సినిమా తరువాత ఇండస్ట్రీలో ఎవరికి కనిపించటం లేదు. ఈ గ్యాప్ లో యూత్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి రాజ్ తరుణ్ తో ఓకె చేసుకున్నాడు.ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలనుకుంటున్న చౌదరికి రాజ్ తరుణ్ ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో చూడాలి.వచ్చే శుక్రవారం విడుదల కాబోయే ‘కుమారి 21 ఎఫ్’ మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. టీజర్ – ట్రైలర్ – ఆడియో అన్నీ కూడా సినిమా మీద పాజిటివ్ బజ్ పెంచాయి. దీంతో రాజ్ తరుణ్ కాబోయే హ్యాట్రిక్ హీరో అని ప్రచారం జరుగుతోంది టాలీవుడ్ లో. తొలి సినిమా హిట్టయినప్పటికీ రెండో సినిమాకు పాతిక లక్షలే రెమ్యూనరేషన్ గా తీసుకున్నాడు రాజ్ తరుణ్.

అంతే కాదు మొన్నటికి మొన్న రాం గోపాల్ వర్మ పై కామెంట్ల యుద్దం డ్రామాతో సంచలం రేపతానికి ముందే వర్మతో ఒక మూకీ సినిమా కి సై అన్న సంగతి తెలిసిందే కేవ్లం ఆ సినిమా పబ్లిసిటీ కోసమే ఆ ఏపిసోడ్ అంతా జరిగిందని స్వయంగా వర్మ నే వివరణ ఇచ్చాడు.‘వర్మతో కలిసి ఓ సినిమా చేస్తున్నాను. నాకు తెలిసి వర్మ ఓకే ఓకే డైరెక్టర్. నేను అతనికి పెట్టుకున్న ముద్దు పేరు అప్పారావు. నేనే డైరెక్టర్ అయ్యుంటే వర్మ తీసిన శివ, రంగీలా కంటే బెటర్ సినిమాలు తీయగలిగేవాడిని. నేను వర్మతో ఓ సినిమా చేస్తున్నా అతను ఓకే డైరెక్టర్ అని తెలుసు కానీ అతని తప్పుల్ని నేను కరెక్ట్ చెయ్యగలనని’ రాజ్ తరుణ్ గత రాత్రి ట్వీట్స్ చేసాడు. ఇదంతా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న టైంలో వర్మ ఆరాంసే ‘రాజ్ తరుణ్ నాపై వేసిన ట్వీట్స్ ని నేనే సరదాగా అతని అకౌంట్ నుంచి వేసాను, అవి సీరియస్ గా తీసుకోవద్దని’ వర్మ ట్వీట్ చేసాడు. దీంతో ఇదోరకం వర్మ పబ్లిసిటీ అని అందరూ పెదవి విరిచారు. ఐతే ఇలా పెద్ద దర్శకు లూ పెద్ద బ్యానర్ లూ వరుస అవకాశాలతో ఉక్కిరి బిక్కిరవుతున్న రాజ్ తరుణ్. నెక్స్ట్ సినిమానుంచీ కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. దాని కోసమే తన కు వచ్చే అవ్కాశాల బ్యానర్ లను వెంట వెంటనే అందరికీ తెలిసే లా చూసి తన స్థాయి పెరిగిందనే విసయాన్ని చెప్పకనే చెబుతున్నాడు. అందుకే ఆ ఆఫర్లని అందరికీ చెప్తున్నాడు తప్ప దేనినీ ఇంకా ఓకే చెయ్యకుందా ఆపుతున్నడు.వచ్చే వారం ‘కుమారి 21 ఎఫ్’ హిట్టయితే. అప్పుదు తన రేటెంతో చెప్తాడన్న మాట.

(Visited 56 times, 1 visits today)