Home / Entertainment / ‘తేరి’ టీజర్ తో తన సత్త చాటుతున్న విజయ్

‘తేరి’ టీజర్ తో తన సత్త చాటుతున్న విజయ్

Author:

తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ వరుసగా నాలుగు విజయాలు సాధించి రెడ్‌ హాట్‌ ఫామ్‌లో ఉన్న సమయంలో భారీ అంచనాల మాధ్యా విడుదలైన పులి చిత్రం దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఇళయదళపతి డ్యూయల్ రోల్ లో నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ‘తేరి’ మాత్రం ఫాన్స్‌కి ఫుల్‌ మీల్స్‌లా అనిపిస్తోంది. ‘రాజారాణి’ఫేంఅట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన సమంతా,ఎమీ జాక్సన్ జతకడుతున్నారు.

ఈ సినిమాలో విజయ్‌ని చాలా కొత్తగా చూపిస్తూ, సూపర్‌ ఫ్రేమింగ్స్‌తో స్టయిలిష్‌గా కట్‌ చేసిన ఈ చిత్రం టీజర్‌ ఆల్రెడీ పెద్ద హిట్‌ అయింది. యూట్యూబ్‌లో పెట్టిన కొన్ని గంటల్లోనే ఏడు లక్షలకి పైగా వ్యూస్‌ వచ్చిన ఈ టీజర్‌కి లక్షా పాతిక వేలకి పైగా లైక్స్‌ వచ్చాయి. ‘తేరి’చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, మరో రోల్ లో కూతురంటే ఎంతో ఇష్టమైన తండ్రిగా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు విజయ్. ఇద్దరు హీరోయిన్లకు టీజర్ లో అవకాశం ఇవ్వలేదు. జివి. ప్రకాష్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా విడుదల కానుంది.

(Visited 144 times, 1 visits today)