Home / Inspiring Stories / మూడు వందల నుండి లక్షల్లో టర్నోవర్ సాధిస్తున్న నగర కుర్రాడు.

మూడు వందల నుండి లక్షల్లో టర్నోవర్ సాధిస్తున్న నగర కుర్రాడు.

Author:

ఒకప్పుడు పిల్లలు ఇంటర్ నెట్ లో చాలా సమయం ఉంటే వారి తల్లిదండ్రులు తిడుతుండేవారు. అవసరం వచ్చే పనులకు ఉపయోగించుకోవాలి కానీ అనవసరమైన పనులకు కాదు అంటూ స్విఛ్ ఆఫ్ చేసి పడుకో అంటూ తిట్టేవారు. కొన్ని రోజుల తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తరవాత తల్లిదండ్రులు ఏం అనలేని పరిస్థితి వచ్చింది.కానీ ఒక 22 సంవత్సరాల అబ్బాయి మాత్రం ఇంటర్ నెట్ ని ఉపయోగించుకొని సరదాగా రాసే బ్లాగ్ లతో లక్షలు సంపాదిస్తున్నాడు. బిటెక్ కూడా పూర్తీ కాకుండానే ఇతరులకు పని ఇస్తూ ఉద్యోగం లేని యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు నగరానికి చెందిన ఇమ్రాన్.

ఎవరో వచ్చి ఎదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు అన్నారు పెద్దలు అందుకే ఇమ్రాన్ చిన్నతనం నుండే ఏదైనా స్పెషల్ గా చేయడం అలవాటు, అది కూడా డబ్బులు వచ్చే పని అంటే కచ్చితంగా దానిని అంతూ చూసేవరకూ వదలడు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఇమ్రాన్ చిన్నతనం నుండి డబ్బు విలువ తెలిసిన వ్యక్తి. అందుకే +2 చదివే వరకు కుటుంబం పై ఆధారపడిన తరవాత తాను చిన్న చిన్న పనులు చేసి డబ్బులు సంపాదించేవాడు. అలా కొన్ని రోజుల తరవాత సరదాగా బ్లాగ్స్ రాయడం మొదలు పెట్టాడు.

బ్లాగ్స్ రాయడం మొదలు పెట్టిన తరవాత ఒక 6 నెలలు దానిపై శ్రద్దగా కూర్చొని ఏ విధంగా రాయాలి అని అని నేర్చుకొని మెల్లిగా అందరికి నచ్చే విధంగా రాయడం మొదలు పెట్టాడు. 6 నెలల తరవాత సంపాదన మొదలు అయింది. మొదటి సారి సంపాదన 300 వచ్చింది. మొదటిలో ఇమ్రాన్ ఎక్కడైనా కనిపించిన వార్తను లేదా ఆరోగ్యానికి సంబంధించిన  విషయాలను రాసేవాడు. అలా చేయడంతో తనకు కొద్దిగా మాత్రమే ఆదాయం వచ్చేది. కొన్ని రోజులు పోయిన తరవాత తన స్నేహితులు ఒకసారి మాటలలో ఏదైనా కొత్తగా రాసి వాటి కాపీ రైట్స్ ఉండే విధంగా చూసుకుంటే నీకు ఎక్కువ ఆదాయం ఉంటుంది కదా !అనడంతో ఇమ్రాన్ వెంటనే ఆల్ టెక్ బజ్ అనే సొంత బ్లాగ్ ఏర్పాటు చేసుకున్నాడు.అక్కడి నుండి ఇక తను వెనిదిరిగి చూసుకోలేదు. అలా 300 వందలతో సంపాదన మొదలు పెట్టి ఇప్పుడు 5 లక్షల వరకు సంపాదిస్తూ తన తోటి వారికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి చేరుకున్నాడు. త్వరలోనే ఎంటర్టెన్ మెంట్ బ్లాగులను కూడా మొదలు పెడతాను అంటున్నాడు ఇమ్రాన్.

ఇమ్రాన్ ఇప్పటి వరకు దాదాపు 13 బ్లాగులను ఏర్పాటు చేసి సొంతంగా ఒక ఆఫీసునీ ఏర్పాటు చేసుకొని 20 మందికి పైగా ఉద్యోగం ఇచ్చాడు. ఇలా వివిధ బ్లాగుల ద్వారా దాదాపు 15 లక్షల వరకు సంపాదిస్తూ భారతదేశంలో బ్లాగుల ద్వారా సంపాదిస్తున్న వ్యక్తులలో టాప్ 10 ఒకడిగా ఉంటూ అందరి ప్రశంసలు పొందుతున్నాడు. చిన్నతనంలోనే ఒక వైపు సంపాదిస్తూనే ఇతరులకు ఉద్యోగం ఇస్తూ,తనకు తెలిసిన సంపాదన మార్గాన్ని ఇతరులకు కూడా నేర్పిస్తూ  చాలా మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు హైదరాబాద్  నగర కుర్రాడు.

ఈ రోజు తన పుట్టిన రోజు ఒక్కసారి అందరూ తనని విష్ చేస్తూ మరింత ముందుకు వెళ్లి తనలాంటి వారికి ఎంతో మందికి స్ఫూర్తి  ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి మా Alajadi.com తరపున పుట్టిన రోజు శుభకాంక్షలు ఇమ్రాన్.

(Visited 2,319 times, 1 visits today)