Home / Inspiring Stories / వైఫై స్లోగా ఉంటే బీరు తాగేయండి.

వైఫై స్లోగా ఉంటే బీరు తాగేయండి.

Author:

ఇంటర్ నెట్ విలాసపు జాబితాలోంచి సామాన్యుడి నిత్యావసరాల జాబితాలోకి చేరిపోయింది. డాటా వాడకంతో స్మార్ట్ ఫోన్ లోనూ ఇప్పుడు ఇంటర్నెట్ వాడకం ఊపందుకోవటం తో “వైఫై” దాదాపు ప్రతి ఇంట్లో ఉండే వస్తువు కోటాలోకి ఎపుడో చేరిపోయింది. ఇంట్లో 24*7 ఆన్ లో ఉండే అతితక్కువ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లో వైపై రౌటర్ ఒకటి. ఐతే కాస్త పెద్ద ఇళ్ళు ఉన్నవారికీ కొంచం దూరం లో రోటర్ ఉండే వారికీ ఇంటర్నెట్ లో వచ్చే స్లో బ్రౌజింగ్ అనే సమస్య కూడా ఉంటోంది. దీన్ని నివారించటానికి ఒక అద్బుతమైన పరిష్కారం కనుగొన్నరిప్పుడు. మన ఇంట్లోనే మనమే తయారు చేసుకునే ఒక చిన్న పరికరాన్ని తయారు చేసేసారు. దీనికోసం మీరు సమ కూర్చుకోవాల్సిందేంటో తెలుసా బీర్ క్యాన్ ఔను ఖాళీ బీరు క్యాన్ మాత్రమే.. ఎలానో తెలుసు కోవాలనుందా…

ఇంతకీ వారేం చేశారంటే…తాగి పారేసిన ఖాళీ బీర్ టిన్ లను ఉపయోగించి వైఫై వేగాన్ని రెట్టింపు చేసే ప్రక్రియను ఆవిష్కరించారు. వీరి ఆవిష్కరణ ద్వారా వైఫ్ యూజర్స్ వారి సిగ్నల్స్ పరిధిని 2-3 రెట్లు పెంచుకోవచ్చు. ఈ టెక్నిక్ వారొక్కరే వాడుకోకుండా…పేటెంట్లు వంటి గందరగోళం ఏమీ లేకుండా అందరూ వాడుకునే సౌలభ్యం కల్పించారు. బీర్ టిన్ తో వైఫ్ సిగ్నల్ స్ర్టెంగ్త్ ను ఎలా పెంచుకోవాలో డెమాన్ స్ర్టేషన్ చేసి చూపించడమే కాకుండా అందరికీ అందుబాటులో వుండేలా ఈ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం వైఫై ప్రియులు ఈ టెక్నిక్ ను ట్రై చేసి చూడండి. బీరు అలవాటు లేని వారు సాఫ్ట్ డ్రింక్ టిన్ ని కూడా వాడుకోవచ్చు…

Must Read: ఒక్క మెసేజ్ తో రైలు భోగిని శుభ్రం చేయించుకోవచ్చు.

(Visited 3,948 times, 1 visits today)