Home / health / ఈ చిట్కాతో మీ పిల్లల జ్ఞాపకశక్తితో పాటు ఆరోగ్యాన్ని పెంచండి.

ఈ చిట్కాతో మీ పిల్లల జ్ఞాపకశక్తితో పాటు ఆరోగ్యాన్ని పెంచండి.

Author:

ఈ రోజులలో పిల్లల చదువుల కోసం వారి తల్లిదండ్రులు చేయని త్యాగం లేదు. తమ పిల్లలకు మంచి భవిష్యత్ ఉండాలని వారిని పేరున్న విద్యాసంస్థలలో వేయడానికి లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. కానీ అందరూ పిల్లలు తల్లితండ్రులు అశించినట్లు చదువులో చురుకుగా ఉండరు. లక్షలు ఖర్చు పెట్టినా పిల్లలు అనుకున్నంత జ్ఞానం సంపాదించకుండా, మతిమరుపు తో బాధపడుతుంటే వారిని చిన్న ఆయుర్వేదిక్ మొక్క సహాయంతో తిరిగి ఉత్తేజితులను చేయవచ్చు. ఆ మొక్క పేరే బ్రహ్మీ మొక్క లేదా సరస్వతి మొక్క. దీని సాంకేతిక నామం: బాకోప మున్నేరి.

uses of saraswathi plant

సరస్వతి ఆకు పొడి – 50 గ్రాములు మరియు మిరియల పొడి – 3 గ్రాములు కలిపి నిలువ చేసుకుని, ప్రతి రోజు పిల్లలకు ఉదయం పరిగడుపున 4 చిటికెల పొడి ,1 చుప్ ఆవు పలతో లేదా గోరువెచ్చని నీటిలో వెసి కొంచెం పటిక బెల్లం కలిపి త్రాగించాలి. ఇలా రోజూ తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సర్వసతి మొక్క గురించి పురాణాలలో కూడా ఉంది. సర్వసతి మొక్క ఉపయోగాలు ఒక్కసారి తెలుసుకుందాం!..

  • ముఖ్యంగా ఈ చెట్టు యొక్క ఆకులలో తీపి, చేదు, వగరు మిళితం అయి ఉంటాయి.
  • పిల్లలకు జ్ఞాపక శక్తి పెరగాడానికి సహకరిస్తుంది.
  •  ఈ ఆకు పొడి పిల్లల ఆకలిని పెంచుతుంది.
  • సరస్వతి ఆకు పిల్లల మెదడునే కాదు రక్తాన్ని కూడా శుభ్రం చేస్తుంది.
  • మెదడుకు సంభందించిన అనేక వ్యాధులను తగ్గిస్తుంది.
  • సరస్వతి ఆకుల రసం ఆయుష్షు పెరగటంలో ఉపయోగపడుతుంది.
  • చిన్న పిల్లలకు నత్తి వస్తే ఈ సరస్వతి మొక్క ఆకు పొడిని తినిపించి తగ్గిస్తారు.

మరి ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని నర్సరీకి వెళ్ళి సరస్వతి మొక్కను ఇంటికి తెచ్చుకోండి. మీరు సరస్వతి మొక్క ను ఎప్పుడు చూసి ఉండక పోతే పైన ఫోటోలో చూసి గుర్తు పట్టండి.

(Visited 8,423 times, 1 visits today)