Home / Inspiring Stories / నైజీరియా బతుకుల్లో “హోప్” కలిపిస్తున్న సామాజిక కార్యకర్త.

నైజీరియా బతుకుల్లో “హోప్” కలిపిస్తున్న సామాజిక కార్యకర్త.

Author:

nigeria hope

బ్రతుకు అర్ధం తెలియాలంటే మనం ఇతరులపై కుసుమంత అయిన మానవత్వాన్ని చూపించాలి. నేడు మనుషులలో మానవత్వం అనేది పూర్తిగా అంతరించి పోతుంది. కానీ అప్పుడప్పుడు ప్రపంచంలో కొన్ని సంఘటలను చూస్తే మాత్రం భూమిపై ఇంకా మానవత్వం బ్రతికే ఉంది అనిపిస్తుంది.

నైజీరియా ఈ దేశం పేరు చెబితే వెనుకబాటు తనం మాత్రమే కాదు మూడనమ్మకాలును మూర్ఖంగా నమ్ముతున్న దేశంగా మనకు సుపరిచితమే. అలా ఒక జంట తమకు పుట్టిన రెండున్నరేళ్ల చిన్నారిని దెయ్యమనుకుని ఆ తల్లిదండ్రులు వదిలిపెట్టారు. దానితో 8నెలలుగా వీధుల్లో తిరుగుతూ దొరికిందల్లా తింటూ బక్కచిక్కి ప్రాణంపోయే స్థితి వచ్చాడు ఆ బాలుడు . ఎప్పుడూ చెత్తకుప్పల దగ్గర ఉంటూ చెత్త చెదారాం తింటూ కడుపులో పురుగులు వచ్చి కట్టెపుల్లలా తయారు అయ్యాడు. ఈ విషయం తెలిసి చలించిపోయింది సామాజిక కార్యకర్త అంజా రింగ్రెన్ లోవెన్.
కారుమబ్బులు ఆవరించిన కటిక చీకటి జీవితంలో ఉన్న ఆ బాలుడి జీవుతంలో వెలుగులను ప్రసరింపచేసింది ఈ కాంతిమూర్తి. పూర్తి అనారోగ్యంగా ఉన్న ఆ బాలుడిని చేరదీసి హోప్ అని పేరు పెట్టింది. ఈ ‘హోప్’ను నెల రోజులపాటు ఆస్పత్రిలో ఉంచి ప్రతి రోజు కొత్త రక్తాన్ని ఎక్కించారు. కడుపులో పెరిగిన పురుగులను తొలగించారు. హోప్ జీవితానికి నిజమైన హోప్‌ను కల్పించారు.

             రెండు నెలల క్రితం అనగా జనవరి 31వ తేదీన అంజా రింగ్రెన్ లోవెన్ చేరదీసి ఆ బాలుడి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు ప్రపంచం స్పందించింది. బాలుడి వైద్య ఖర్చుల కోసం ఆమె అప్పీల్ చేయగా, ప్రపంచవ్యాప్తంగా 68 లక్షల రూపాయల విరాళాలు వచ్చాయి. ‘ఆఫ్రికన్ చిల్డ్రన్స్ ఎయిడ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్’ను ఆఫ్రికాలో నిర్వహిస్తున్న లోవెన్ అనాథ ఆఫ్రికన్ పిల్లలను, మూఢనమ్మకాల కారణంగా వదిలేసిన పిల్లలను చేరదీసి వారికి విద్యాబుద్ధులు చెప్పిస్తున్నారు. మీరే చూడండి రెండు నెలకు ముందు ఇప్పుడు ఎలా ఉన్నాడో ఆ అబ్బాయి….

hope anja ringgren lovén

(Visited 405 times, 1 visits today)