Home / Entertainment / ఇండిపెండెంట్ ఉమెన్ ఉరఫ్ మంచు లక్ష్మీ ప్రసన్న…!

ఇండిపెండెంట్ ఉమెన్ ఉరఫ్ మంచు లక్ష్మీ ప్రసన్న…!

Author:

ఎన్నో విమర్శలూ ఇంకెన్నో జోకులు ఒక ఆడపిల్లకి ఈ దేశం లో మామూలే అందులోనూ ఆమె ఒక సెలెబ్రిటీ కి కూతురైతే ఇంకా,ఆ సెలెబ్రిటీ సినిమా రంగానికి చెందిన వారైతే..!? అవి మరింత ఎక్కువగా ఉంటాయి ఒక్కోసారి వారి వ్యక్తిగతంగా కూడా బాధ పెట్టే మాటలను వినాల్సి వస్తుంది.ఇలా ఐనప్పుడు ఏం చేస్తారెవరైనా..!? బాదపడతారు కుంగిపోతారు లేదా జనాన్నుంచి తప్పుకు తిరుగుతారు.కానీ ఒకమ్మాయి అలా
భాదతో వెనకడుగెయ్యలేదు ఎవర్నీ తిరిగి నిందించ లేదు… సమాధానం గా తన విజయాలనే చూపించింది తప్ప తాను ఎదుటి వారిని విమర్శించే స్థాయికి ఎప్పుడూ దిగలేదు… ఆ అమ్మాయి ఎవరో కాదు డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తే మంచు లక్ష్మీ ప్రసన్న.

Manchu lakshmi  with mohan babu

మోహన్ బాబు కుమార్తే అనే మాట కేవలం లక్ష్మి తండ్రి పేరు ని చెప్పటానికే.. ఎందుకంటే ఇప్పుడు మంచులక్ష్మి అంటే కేరాఫ్ మంచు లక్ష్మి అంతే..! ఒక ఇండిపెండెంట్ ఉమన్ గా నిలబడటానికి ఆమె ఎన్ని రాత్రులని కన్నీళ్ళతోనో లేదా తనకు తాను ధైర్యం చెప్పుకునే మాటలతోనో గడిపి ఉండొచ్చు. కేవలం ఒక కూతురు గా, ఒక భార్య గా మాత్రమే కాకుండా ఫలానా, తాలూకా, లాంటి మాటలు అవసరం లేకుండా లక్ష్మీ ప్రసన్న అని మాత్రమే అనిపించుకోవటానికి ఆమె చేయని ప్రయత్నం లేదు…. అన్ని ఇబ్బందులనీ అధిగమించిన అమ్మాయి ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న తనని తాను నిరూపించుకున్న ఒక ఇస్పైరింగ్ పర్సనాలిటీ…

మోహన్ బాబు కుమార్తేంటీ సినిమా హీరోయిన్ ఏమిటి? ఈ మాట రెండురకాలు గా వినిపించింది ఆమెకి మోహన్ బాబు అభిమానులేమొ మా ఇంటి ఆడపిల్ల అన్నంత ఇదిగా సినిమా హీరోయిన్ అంటే ఆమె గౌరవం తగ్గుతుందేమో అనే ఉద్దేశం తో, సినిమా వాళ్ళు ఈ అమ్మాయేం నటిస్తుందీ అనే ఉద్దేశం తో… నిజానికి సినిమా వాళ్ళ కంటే అభిమానుల మాటలే ఆమెని బాదపెట్టి ఉండాలి ఔను “నటన రాక పోతే తాను నేర్చు కోగలదు మరి సినిమాల్లో ఉన్న ఆడవాళ్ళ పై ఉన్న చిన్న చూపు ని ఎలా తగ్గించటం?” ఈ ఆలోచనలో ఉంటూనే తన వ్యక్తి గత జీవితాన్ని ఏమాతరం నిర్లక్ష్యం చేసుకోలేదు. తన తండ్రిని కానీ భర్త ఆండీ శ్రీనివాసన్ ను కానీ ఎప్పుడూ బాదపెట్టనూ లేదు.  ఏమాట కామాటే చెప్పుకుంటే మోహన్ బాబు లాంటి అంత ఆవేశ పడే మనిషి పెంపకం లో లక్ష్మి “ప్రసన్నం” గా ఎలా పెరిగిందీ..!? బహుశా మోహన్ బాబు తండ్రిగా మనక్కనిపించే ఆవేశ పరుడు కాదేమో..! కేవలం తండ్రిలో ఉన్న ముక్కుసూటి దనాన్ని మాత్రం పూర్తిగా వంట పట్టించుకుంది.. ఆ ముక్కు సూటితనం తోనే కొన్ని ఇబ్బందులు వచ్చినా పట్టించుకోలేదు.. పట్టించుకుంటే లక్ష్మీ ప్రసన్న ఎందుకవుతుందీ…!?

Manchu Lakshmi Prasanna Birth day 2

2008 లో “ఒడే అనే ఆంగ్ల సినిమాలో ఒక పాత్ర తెలుగు వారికి నచ్చకున్న ఇంగ్లీష్ డైరెక్టర్ అయిన ఇండియన్ మనిషి నీరంజన్ కి లక్ష్మి నటన నచ్చింది, మరో హాలీవుడ్ డైరెక్టర్ “కార్బిన్” కి ఓడే లో ఉన్న నజ్మా గా ఉన్న లక్ష్మి చూపించిన నటన నచ్చింది. తన సినిమా “డెడ్ ఎయిర్” లో తీసుకున్నాడు “గబ్బీ” పాత్ర నజ్మాని మరిపించింది లక్ష్మి అంటే ఏమిటో ప్రపంచానికి చెప్పింది. భారతీయ సినిమా కంటే ముందే అంతర్జాతీయ స్తాయిలో తానొక నటి. సినిమా వాళ్ళకి ఒక సమాధానం ఇచ్చేసింది, ఇక సాధారణ జనానికి ఆడపిల్ల అంటే ఉండే తక్కువ అభిప్రాయం పోవాలంటే?? ఇండియా లోనే ప్రయత్నించాలి.. సో లక్ష్మి భారత్ లో లాండయ్యింది…

హాలీవుడ్ స్థాయి ఇండియన్ సినిమా అందులో ఉండే ఐరేంద్రి పాత్ర కి ఒక్ డైనమిక్ లేడీ కావాలి వెతికారు..వెతికారు వెతుకు తూనే ఉన్నరు అన్వేషణ కి గమ్యం మంచు వారిళ్ళు. రాణీ ఐరేంద్రి “ఒక భయానక జానపద మంత్రగత్తె” ఈ పాత్ర నాకు మైనస్ ఔతుందేమో అనుకోలేదు తనక్కావలసిందే అలాంటి పాత్రలు.. గ్లామర్ అవసరం లేకుండానే నటి అంటే ఏమిటో చూపించాలి. చేసింది అదే నెగెటివ్ పాత్ర లక్ష్మి ఇంటి ముందు 2012 సంవత్సరానికి గానూ బంగారు నందిని కట్టేసింది. సినిమా ఫ్లాప్ లక్ష్మి మాత్రం సూపర్ హిట్..

Manchu Lakshmi Prasanna Birth day 1

ఆ తర్వాత దొంగల ముఠా, డిపార్ట్ మెంట్,  ఊ..కొడతారా ఉలిక్కిపడతారా, కడలి, గుండెల్లో గోదారి ఇలా వరసగా సినిమాల్లో నటిస్తూనే నిర్మించింది కూడా..చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే గ్లామర్ రంగం అనుకునే సినిమా రంగం లో అసలైన గ్లామర్ అంటే నటన మాత్రమే అని నమ్మిన లక్ష్మి తన నటనని తప్ప శరీరాన్ని చూపించలేదు. ఎక్కడ ఏది అవసరమో అది మాత్రమే చేయటం ఆమెకి చిన్నప్పటినుంచీ అలవాటు.. తను పుట్టిన దగ్గర్నుంచీ అంటే 1977 అక్టోబర్ 8 నుంచీ ఇదే ఫాలో ఔతొంది…తను చేసిన ప్రతీ పాత్రలోనూ తన మార్క్ ని వేసుకుంది,ప్రతి చోటా తన కంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకుంది… ఇలా చెప్పుకోవాలంటే ఒక డైనమిక్ లేడీ అనేమాట గురించి పెద్ద వ్యాసమేరాయాలి… అన్నట్టు అసలిదంతా ఏం చెప్పటానికి మొదలు పెట్టానో అదే మర్చిపోయాను. ఇవాల మంచు లక్ష్మి బర్త్ డే .. ఇవాళ లక్ష్మి గారి బర్త్ డే  హ్యాపీ బర్త్ డే
లక్ష్మీ ప్రసన్న గారూ…!

(Visited 123 times, 1 visits today)