Home / Inspiring Stories / ఇక భారత సైన్యం లోనూ కదం తొక్కనున్న మహిళలు.

ఇక భారత సైన్యం లోనూ కదం తొక్కనున్న మహిళలు.

Author:

indian-woman-in-air-force

మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే దేశాలలో ఎప్పటినుంచో భారత దేశం ముందంజ లోనే ఉంది… పురాణాల్లో నరకాసురున్ని వధించీన సత్యభామ నుంచీ స్వతంత్ర సంగ్రామం లో కత్తితో బ్రిటీషు ముష్కరులనెధిరించిన ఝాన్సీ లక్స్మీ భాయ్ వరకూ మన దేశం లో యుద్ద క్షేత్రం లో కదం తొక్కిన వీర నారీమణులకు లెక్కే లేదు. అయితే మధ్యలో జరిగిన కొన్ని పురుషాహంకార చర్యల ఫలితంగా స్త్రీ మళ్ళీ తన కార్య స్థలాన్ని వంటగదికి మార్చుకుంది. ఎన్నో సాధించినా ఎంతగా ఎదిగాను ననుకున్న కీలకమైన రక్షణ రంగం లోకి మాత్రం ఒక్క భారత దేశం మాత్రమే కాదు ప్రపంచ దేశాలన్నీ ఒకే పంథాలో నడిచాయి. సైన్యంలో స్త్రీల జోక్యాన్ని అసలు పడనివ్వలేదు.నాజూకుగా ఉండే ఆడవారు నానా కష్టాలు పడలేరు అనేది సాకుగా చెప్పేవారు. ఆ తర్వాత ఆర్మీలో వైద్య విభాగంలో మహిళలను తీసుకోవడం ప్రారంభించారు. డాక్టర్లు, నర్సులుగా మాత్రమే మహిళలను సైన్యంలోకి తీసుకునేవారు. 1992లో వైద్యేతర విభాగాలైన ఏవియేషన్, లాజిస్టిక్స్, న్యాయవిభాగం, ఇంజనీరింగ్ ఇతర ఎగ్జిక్యూటీవ్ క్యాడర్లలోకి మహిళలను తీసుకోవడం ప్రారంభించారు. వారిని కేవలం షార్ట్ సర్వీస్ కమిషన్డ్ అధికారులుగా మాత్రమే తీసుకుని పరిమితం చేశారు. అంటే వీరికి పెన్షన్ రాదు. రిటైర్ అయిన తర్వాత వైద్య సౌకర్యాలు అందవు. ఈ సందర్భం లో సాంప్రదాయాలను ధిక్కరిస్తూ తొలి అడుగు వేసింది చైనా… రక్షణ రంగం లో స్త్రీలతో కూడిన బలగాలనూ ఏర్పాటు చేసింది.అదే బాటలో మరిన్ని దేశాలూ నడిచాయి గానీ ఒకటీ రెండు దేశాల్లో తప్ప పెద్దగా మార్పు లేదు…. అయితే ఇప్పుడు ప్రభుత్వం రక్షణ శాఖ లోని అన్ని విభాగాల్లోనూ కీలక పోస్టులలో కూడా మహిళలను తీసుకోనున్నట్టు వచ్చిన ఒక వార్త ఒకింత ఆనందంగా నే ఉంది.లోక్ సభ,రాజ్యసభ ఇలా ఉభయ సభలతోనూ చర్చించీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకోనున్నారట…

ఈ నేపథ్యంలో భారత వాయుసేనలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నది. భవిష్యత్తులో ఏ దేశంతోనైనా యుద్ధమంటూ వస్తే ఇక నుంచి పురుషులతోపాటు మహిళా పైలట్లు కూడా యుద్ధ విమానాలతో శత్రువులను చీల్చి చెండాడనున్నారు. భారత వైమానిక దళంలో ఇప్పటివరకు రవాణా విమానాలను మాత్రమే నడుపుతున్న మహిళా పైలట్లు యుద్ధ విమానాలను కూడా నడిపేందుకు రక్షణశాఖ 2015లోనే ఆమోదం తెలిపింది. యుద్ధ విభాగంలో కూడా మహిళా పైలట్లను భాగస్వాములను చేయనున్నట్లు అప్పటి రక్షణశాఖ ప్రతినిధి ఒక ప్రకటన్ చేసారు. ఎంపికైన వారికి యుద్ధ విమానాలు నడుపటంలో 7 నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చి 2016 జూన్‌లో యుద్ధ విభాగంలోకి తీసుకొంటారు. ఆ తర్వాత మరో ఏడాదిపాటు అత్యాధునిక శిక్షణ ఉంటుంది. అది పూర్తిచేసిన పైలట్లను 2017 జూన్‌లో యుద్ధ విమానాల కాక్‌పిట్‌లోకి అనుమతిస్తారు. ఈ ప్రగతిశీల నిర్ణయం భారత మహిళల ఆకాంక్షలను నెరవేరుస్తుంది. అభివృద్ధి చెందిన దేశాల్లోని వైమానిక దళాల్లోని సమకాలీన పోకడలను అనుసరిస్తుంది అని రక్షణశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. త్వరలోనే యుద్ధ విభాగంలో మహిళా పైలట్లకు స్థానం కల్పిస్తామని చెప్పారు. ఈ మేరకు వైమానిక దళం పంపిన ప్రతిపాదనకు రక్షణశాఖ ఆమోదం తెలిపింది.

భారత వైమానిక దళంలో ఇప్పటికే దాదాపు 1500 మంది మహిళలు సేవలందిస్తున్నారు. వీరిలో 94 మంది పైలట్లు, 14 మంది నేవిగేటర్లున్నారు.అయితే ఈ మహిళా పైలట్లకు రవాణా విమానాలు, హెలికాప్టర్లను నడపటానికి మాత్రమే అనుమతి ఉంది తప్ప యుద్ధ క్షేత్రంలో యుద్ధ విమానాలను నేరుగా నడిపేందుకు మహిళా పైలట్లకు ప్రవేశానుమతి లేదు. కానీ ఇప్పుడు తీసుకున్న తాజా నిర్ణయంతో ఎయిర్‌ఫోర్స్‌లో మహిళలకు అన్ని విభాగాల్లో సమాన ప్రాధాన్యం లభిస్తుంది. త్రివిధ దళాల్లో గత ఐదేండ్ల కిందటివరకు కూడా మహిళలకు సుదీర్ఘ కాలం సర్వీసు చేసేందుకు అనుమతి లేదు. వారి సేవలపై పరిమితి ఉండేది. 2010లో ఢిల్లీ హైకోర్టు తీర్పుతో పరిస్థితి మారిపోయింది… ఇప్పుడు మహిళా చైతన్యం రక్షణ రంగం లోకీ పాకనుంది. భారత దేశ రక్షణలో మహిళలూ తమ శక్తిని నిరూపించనున్నారు….

(Visited 350 times, 1 visits today)