Home / Latest Alajadi / భర్తలను చితక్కొట్టడంలో ప్రపంచంలో మనదేశపు ఆడవారిది మూడవ ర్యాంక్!

భర్తలను చితక్కొట్టడంలో ప్రపంచంలో మనదేశపు ఆడవారిది మూడవ ర్యాంక్!

Author:

ఇంట్లో గొడవ అయితే ఎప్పుడైనా ఆడవారికే దెబ్బలు పడుతాయి అనేది పాత మాట. భర్తల చేతులలో దెబ్బలు తిని హింసకు గురయ్యే సంఘటనలు మనం రోజు చూస్తాము. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఇలా భర్త చేతులలో కంటే భార్య చేతులలోనే దెబ్బలు తింటున్న భర్తలు పెరుగుతున్నారని తాజాగా ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదికలో తెలిపింది.

indian-wives-have-been-ranked-third-in-beating-husbands-1

ఇంట్లో భార్యభర్తలకు మాట మాట పెరిగి సహనం నశించి మగవారు మాటలు అనలేక చేతికి పని చెప్పడం ఎక్కువగా జరుగుతుంటుంది. ఇక చీటికి మాటికి చీదరించుకునే ఆడవారు సహనం నశించి గరిటెలు, చీపుర్లతో మగవారిపై విరుచుకుపడటం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ రోజులలో మగవారి కంటే ఆడవారిదే పై చేయి అవుతొంది. ఇలాంటి భార్య బాధితులు ఎక్కువగా ఉన్న దేశం ఈజిప్టు , ఇంగ్లాండ్, భారత్ లు మొదటి మూడు వరుసలలో ఉన్నాయి. అంటే భర్తలను,తిట్టడం,కొట్టడం ఈజిప్టు ఆడవారు మొదటి వరుసలో ఉండగా రెండవ స్థానాన్ని ఇంగ్లాండ్ వారు ఆక్రమించారు. ముచ్చటగా మూడవ స్థానంలో మాత్రం మన దేశం ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించింది. మన దేశంలో ఆడవారిపై ఎక్కువగా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అని టీవీలలో, పేపర్లలో చదవడం చూశాం కానీ ఇలా భర్తలను హింసపెట్టే ఆడవారు ఉన్నారని తాజా అధ్యయనంలో తెలిసింది.

ఈ తాజా సమాచారం ఎలా తెలిసింది అంటే ఆయా దేశాల ఫ్యామిలీ కోర్టులలో ఉన్న కేసులను పరిశీలించగా ఈ విషయం బయటపడింది. ఈ విషయంలో ఈజిప్టులో 66% మంది ఆడవారు తమ భర్తలను కసి తీరా కొట్టిన తర్వాతనే విడాకులు తీసుకుంటారట! ఇక మన దేశంలోని మహిళలు అయితే వారి చేతికి దొరికిన చీపురులు, వంటిట్లో ఉండే గరిటెలు, గిన్నెలు, చెప్పులు, సూదులతో ఎక్కువగా దాడి చేస్తారట!. మరి ఈ నివేదికను ఎందుకు బయటపెట్టారు అంటే రోజు రోజుకు కోర్టులలో భార్య బాధితుల కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని అందరికి వీటి గురించి అవగాహన కల్పించడం కొరకు విడుదల చేసారు.

(Visited 865 times, 1 visits today)