Home / Political / పాకిస్థాన్, బంగ్లాదేశ్ కంటే మనమే తక్కువ

పాకిస్థాన్, బంగ్లాదేశ్ కంటే మనమే తక్కువ

Author:

india pakistan bangladesh together

భారత్‌లో ఆనందం ఏమాత్రం వికసించడం లేదు. ఆనందకర దేశాల జాబితాలో భారత్‌ అట్టడుగున ఉండటం ఇదే విషయాన్ని చాటుతోంది. ఆనందం విషయంలో మన పొరుగు దేశాలు చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఎంతో మెరుగైనా స్థానాల్లో ఉన్నా భారత్‌ మాత్రం మరోసారి అట్టడుగు ర్యాంకుకే పరిమితమైంది.

ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ 156 దేశాలతో ఆనందకరమైన దేశాల జాబితా రూపొందించగా అందులో భారత్‌కు 118వ స్థానం వచ్చింది. మన కన్నా సోమాలియా (76), చైనా (83), పాకిస్థాన్ (92), ఇరాన్ (105), పాలస్తీనా (108), (110) మెరుగైన స్థానాల్లో ఉండటం గమనార్హం. ఐరాసకు చెందిన నిరంతర అభివృద్ధి పరిష్కారాల నెట్‌వర్క్‌ (ఎస్డీఎస్‌ఎన్‌) ఈ రూపొందించిన ఈ జాబితాలో డెన్మార్క్‌ అత్యంత ఆనందకరమైన దేశంగా తొలిస్థానంలో నిలిచింది. గత ఏడాది ఈ జాబితాలో మొదటిస్థానంలో ఉన్న స్విట్జర్లాండ్ ఈసారి రెండోస్థానానికి పరిమితమైంది. ఆ తర్వాతి స్థానాల్లో ఐస్‌లాండ్(3), నార్వే (4), ఫిన్లాండ్‌( 5) ఆనందకర దేశాలుగా నిలిచాయి. 2015లో ఈ జాబితాలో 117 స్థానంలో ఉన్న భారత్ ఈసారి మరో ర్యాంకు దిగజారడం మన ఆనందరాహిత్యాన్ని చాటుతోంది. 2013లో 111వ ర్యాంకుతో ఆనందం విషయం భారత్‌ కాస్తా బెటరనిపించుకుంది. ఇక ఈ జాబితాలో అమెరికా 13, ఆస్ట్రేలియా 9, ఇజ్రాయెల్ 11 స్థానంలో నిలిచాయి.

రువాండా, బెనిన్, ఆఫ్గనిస్థాన్, టోగో, సిరియా, బురండి వంటి దేశాలు అత్యల్ప ఆనందకరమైన పరిస్థితులతో అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. ఈ నెల 20న ఐరాస ప్రపంచ ఆనంద దినోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నివేదికను విడుదల చేసింది. సంపద పంపిణీ, అసమానతలు, సామాజిక పరిస్థితులపై ఆర్థికవేత్తలు, సైకాలజిస్టులు, సర్వే విశ్లేషకులు, జాతీయ గణాంకాలు, ప్రజారోగ్యం, ప్రభుత్వ విధానాలు ఆధారంగా ఆనందకర దేశాల జాబితాను ఎస్డీఎస్‌ఎన్‌ రూపొందిస్తున్నది.

(Visited 366 times, 1 visits today)