Home / Inspiring Stories / చైనాకి షాక్ ఇచ్చిన మోడీ ప్రభుత్వం.

చైనాకి షాక్ ఇచ్చిన మోడీ ప్రభుత్వం.

Author:

ఆవకాశం వచ్చిన ప్రతిసారి చైనా మన దేశాన్ని ఏదోరకంగా దెబ్బతియాలనే చూస్తూ ఉంటుంది, మన దేశ అభివృద్దిని చూసి ఉండలేక మన దాయాది దేశమైన పాకిస్తాన్ కి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటుంది, అలాగే మనకు సపోర్ట్ చేసే దేశాలపై కూడా ఏదో విధంగా దెబ్బ కొడుతూనే ఉంటుంది, అలాంటి చైనాకు భారత్ చాలా పెద్ద షాక్ ఇచ్చింది, చైనా కింద ఉండే వియత్నాం దేశం ఎన్నో సంవత్సరాలుగా తమకు మన దేశం అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి అమ్మాలని అడుగుతుంది,అయితే చైనాకు భయపడిన యూపిఏ సర్కారు అమ్మడంపై ఎటూ తేల్చుకోలేదు, కాని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చైనాను దారిలోకి తెచ్చేందుకు వియత్నాం కు బ్రహ్మోస్ క్షిపణి లను అమ్మాలని నిర్ణయం తీసుకున్నారు,దీనికి సంబంధించి అన్ని చర్చలూ ముగిశాయి.

BrahMos Missile Vietnam

ప్రతిసారి మన దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ దేశానికి అన్ని విధాలుగా సహకరిస్తున్న చైనా దేశానికి ఇప్పుడు మోడీ తీసుకున్న నిర్ణయం మింగుడుపడటం లేదు, ఈ నిర్ణయం పై మరోసారి ఆలోచించాలని మోడీ సర్కారుకి విన్నవించింది, గతంలో పాకిస్తాన్ గురుంచి మనం ఎన్నిసార్లు విన్నవించిన చైనా పెడచెవిన పెట్టింది, ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా చైనా వాదనని పట్టించుకోవద్దని సైనిక అధికారులు చెప్తున్నారు.సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణిని వియత్నాంకి అమ్మడం ద్వారా మొదటిసారి రక్షణ ఉత్పత్తుల ఎగుమతి ప్రారంభించిన ఘనత మోడీ సర్కారుకు దక్కనుంది. భారత్-రష్యా సంయుక్తంగా తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణి బరువు 3000కేజీలు. పొడవు 8.4మీటర్లు. 200కేజీల అణ్వస్త్రాలను మోసుకెళ్లగలదు. 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు.

Must Read: పాకిస్తాన్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన భారత సైంటిస్టులు.

(Visited 2,773 times, 1 visits today)