Home / Inspiring Stories / 308 పతకాలతో సౌత్ ఆసియాలో ఎగిరిన భారత పతాకం.

308 పతకాలతో సౌత్ ఆసియాలో ఎగిరిన భారత పతాకం.

Author:

South asian games

గౌహతిలో జరుగుతున్న 2016 సౌత్ ఏషియన్ గేమ్స్ లో భారత్ ఆటగాళ్ళు రెచ్చిపోయారు. వివిద విభాగాల్లో భారత దేశం పతకాల పంట పండించింది. కబడ్డీ, షూటింగ్, బాక్సింగ్ లలో సత్తాచాటి దక్షిణాసియాలోనే క్రీడలలో మేటిగా నిలిచింది. 188 బంగారు పతకాలు, 90 వెండి పతకాలు, 30 రజత పతకాలతో మొత్తం 308 పతకాలను తమ ఖాతాలో వేసుకున్న భారత క్రీడాకారులు భారత పతాకాన్ని శాగ్-2016 వేదికలో రెపరెపలాడించారు. ఫిబ్రవరి 5న మొదలైన ఈ క్రీడా సంగ్రామం ఈ రోజుతో ముగిసిపోతుంది.. అందుకే చివరి రోజు గౌహతిలో ఘనంగా ముగింపు ఉత్సవాలు జరగనున్నాయి.

medal-kabaddi

కబడ్డీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై అటు పురుషుల జట్టు, ఇటు మహిళల జట్టూ విజయం సాధించటం విశేషం. షూటింగ్ లో ఇక భారత్ కు తిరగులేకుండా పోయింది. ఈ విభాగంలో మొత్తం 26 స్వర్ణ పతకాలకు గానూ 25 పతకాలను భారత షూటర్లే ఎగరేసుకుపోగా వెండి, రజత పతకాలతో కలిపి షూటింగ్ లోనే మొత్తం 45 పతకాలను భారత్ తన ఖాతాలో వేసుకుంది. గరుప్రీత్ సింగ్, శ్వేతా సింగ్, హీనా సిద్ధూ, యశ్విని సింగ్, కుమార్, అక్షయ్ సుహాస్ పథకాలు సాధించినవారిలో ఉన్నారు. బాక్సింగ్ లో కూడా సౌత్ ఆసియా మొత్తం లో భారత భాక్సర్ల ధాటికి ఎదురు లేకుండా పోయింది. దేవేంద్ర సింగ్, మదన్ లాల్, శివ థాపా, వికాస్ కృష్ణన్, ధీరజ్ రంగి, మనోజ్ కుమార్, మన్ దీప్ జాంగ్రా బంగారు పతకాలను చేజిక్కించుకోగా ఫుట్‌బాల్‌లో మహిళల విభాగంలో స్వర్ణం, పురుషుల విభాగంలో రజతం సాధించాయి. ఇక హ్యాండ్‌బాల్‌లో రెండు విభాగాల్లోనూ భారత దేశం జట్లే పసిడి పతకం అందుకున్నాయి.

medal-shooting-8

(Visited 357 times, 1 visits today)