Home / Inspiring Stories / శత్రువుని కూడా ప్రేమించే దేశం ఈ ప్రపంచంలో బహుశా భారత్ ఒక్కటే కావచ్చు.

శత్రువుని కూడా ప్రేమించే దేశం ఈ ప్రపంచంలో బహుశా భారత్ ఒక్కటే కావచ్చు.

Author:

పవిత్రమైన, సువిశాలమైన మన భరత భూమి ప్రేమకు ప్రతిరూపం. ఎదుటి వ్యక్తి శత్రువైన ఆపదలో ఉంటే ఆదుకుంటుంది, అంతటి గొప్పదేశం మనది కానీ పక్కనున్న పాకిస్తాన్ దీనికి విరుద్దంగా ప్రవర్తిస్తుంది దానికి కారణం వారికే తెలియాలి.

thirsty-pakistani-boy-crosses-ib-in-search-of-water-telugu

యూరీలో భారత జవాన్ లపై జరిగిన దాడిలో భాగంగా 19 భారత జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే, దానికి ప్రతీకారంగా భారత ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్ లో పాక్ లోని ఉగ్రవాదులు చనిపోయారు. అప్పటి నుండి నియంత్రణ రేఖ వెంబడి ఎప్పుడు ఏమి జరుగుతుందో అని అందరూ అందోళనగా చూస్తున్నారు. ఇలా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు జరుగుతున్న ఈ సమయంలో, భారత్-పాక్ సరిహద్దులో పాకిస్తాన్ బోర్డర్ దాటి మన సరిహద్దుల్లోకి వచ్చాడు పాకిస్తాన్ కి చెందిన మొహమ్మద్ తన్వీర్ అనే 12 ఏళ్ల బాలుడు. ఈ విషయం గుర్తించిన అధికారులు ఆ బాలుడిని ప్రశ్నించగా తాగునీటి కోసం వెతుకుతూ వచ్చానని చెప్పడంతో మన అధికారులు ఆ బాలుడికి కడుపు నిండా అన్నం పెట్టి రాత్రి వారి దగ్గరే పడుకోబెట్టుకొని తెల్లవారిన తర్వాత పాకిస్తాన్ అధికారులతో మాట్లాడి ఆ పిల్లాడిని జాగ్రత్తగా వారి గ్రామానికి పంపించారు.

కాని అదే పాకిస్తాన్ ఆర్మీ మాత్రం అనుకోకుండా మన నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్ లోకి వెల్లిన మన ఆర్మీ జవాన్ చందూ బాబులాల్ చవాన్ ను నిర్బంధించింది. అంతే కాకుండా మన ఆర్మీ జవాన్ సమాచారం మాత్రం ఇప్పటివరకు మనకు తెలియజేయడం లేదు. ఎంతైనా శత్రువును ప్రేమించే గుణం ఈ ప్రపంచంలో ఒక్క భారత్ కి తప్ప ఇతర ఏ దేశానికి లేదు అని మరోసారి రుజువు అయ్యైంది.

(Visited 2,265 times, 1 visits today)