Home / Inspiring Stories / ఐసిస్ లో భారతీయ సివిల్ ఇంజినీర్లు.

ఐసిస్ లో భారతీయ సివిల్ ఇంజినీర్లు.

Author:

Indian Civil Engineer in ISIS

“సిరియాలో నా సివిల్ ఇంజినీరింగ్ పరిజ్ఞానంతో భూగర్భ బంకర్లను నిర్మించాను. యువతను ఆకర్షించేందుకు ఐసిస్ సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకుంటుంది”. ఇవి మొన్న భారత్ లో పట్టు బడ్డ ఐసీస్ లో చేరిన భారతీయ ఉగ్రవాది ఆరిబ్ చెప్పిన మాటలు. ‘మాది మహారాష్ట్రలోని పాన్వెల్. సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ తరువాత మే 2014లో నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి ఐసిస్‌లో చేరేందుకు ఇరాక్ వెళ్లాను. ఆత్మాహుతి దాడిలో శిక్షణ పొందాను. తరువాత ఇరాక్‌లోని మోసుల్‌లో కుర్దిష్ సైన్యంపై దాడికి 3 సార్లు విఫలయత్నం చేశాను. మొదటిసారి ఆగస్ట్ 2014లో దాడికి సిద్ధమవుతుండగానే, అంతకుముందు రోజు రాత్రి మేమున్న స్థావరంపై వైమానిక దాడి జరిగింది. మా ఆయుధాలు ఉన్న వాహనం ధ్వంసమైంది. రెండోసారి, సెప్టెంబర్ 2014లో లిబియాలో దాడికి వెళ్తుండగా మా వాహనాన్ని ప్రత్యర్థి సైన్యం ధ్వంసం చేసింది. నాటి కాల్పుల్లో గాయాలతో తప్పించుకున్నా. మూడోసారి మందుగుండు సామగ్రితో ఉన్న మా కారుపై మళ్లీ దాడి జరిగింది.ఆ తరువాత గత నవంబర్‌లో భారత్‌కు వచ్చి, పోలీసులకు చిక్కాను అంటూ అతను చెప్పిన మాటలు విన్న అధికారులే అవాక్కయ్యారట. దర్యాప్తు సంస్థల నుంచి వారి విచారణలో తేలిన విషయాలను ఆంగ్ల వార్తా చానెల్ ఎన్డీటీవీ సంపాదించింది. ఆ వివరాలు నిజమే అనేందుకు ౠజువులూ బయటపడ్డాయి…

Underground Tunnels Built By ISIS in Siriya

ఇరాక్‌లోని సింజార్ పట్టణంలో ఐసిస్ నిర్మించిన భూగృహాలు, సొరంగ మార్గాలు బైటపడ్డాయి. ఇటీవల ఐఎస్ చేతుల్లోనుండి కుర్దిష్ దళాలు సింజార్ ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నప్పుడు ఈ భూగృహాలు వెలుగు చూసాయి. నిద్రపోయేందుకు,విశ్రాంతి తీసుకునేందుకు విద్యుత్ సౌకర్యం ఉన్న బెడ్‌రూమ్‌లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఏడాదిన్నరపాటు సింజార్ పట్టణం ఐసిస్ ఆధీనంలో ఉంది.ఆ కొద్ది సమయం లోనే వాళ్ళు సొరంగాలలో ఇసుక బస్తాలు, బాంబు తయారీ పరికరాలు, ఇతర పదార్థాలు నిలవ చేసుకున్నారు. పేలుడు పదార్థాల గోడౌన్లను నిర్మించారు. అంతే కాదు భూగృహాలను కలుపుతూ ఇంటర్ లింక్ గా 40 సొరంగ మార్గాలు ఉన్నయి. “ఆదంతా చూస్తే పనున్న నగరానికి పోటీ గా మరో నగరాన్ని భూమిలో నిర్మించే ప్రయత్నం చేసినట్టుగా ఉంది” అని ఒక అంతర్జాతీయ రిపోర్టర్ వ్యాఖ్యానించాడు.

Tunnels Built By ISIS

ఇరాక్, సిరియాలలో తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో ఇలాంటివి ఐఎస్ చాలానే ఏర్పాటు చేసుకున్నదని అంటున్నారు. సింజార్ సొరంగాలలో ఆయుధాలతోపాటు ఖురాను ప్రతులు కూడా దొరికాయి. ఇండ్లలోని గోడలు లేదా ఫ్లోరింగ్‌లో కన్నాలు తవ్వి సొరంగాలతో కలిపారు. ఇందుకు పాడుబడ్డ భవనాలనే ఎక్కువగా ఎంచుకున్నారు. సొరంగాలు ఇరుకుగా మనిషి పట్టేంత పరిమాణంలో మాత్రమే ఉన్నాయి. విశాల భూభాగాలను తన ఆధీనంలోకి తెచ్చుకుని సమాంతర ప్రభుత్వాలను నడుపుతున్న ఐఎస్ అమెరికా వైమానిక దాడులకు ముందే వీటిని నిర్మించినట్టు తెలుస్తున్నది.

(Visited 81 times, 1 visits today)