Home / Inspiring Stories / పుట్టిన రాష్ట్రం, దేశం ఎన్ని పతకాలు సాధించిన గుర్తించలేదు, పక్కదేశం అతని ప్రతిభను గుర్తించి ఆదరిస్తుంది.

పుట్టిన రాష్ట్రం, దేశం ఎన్ని పతకాలు సాధించిన గుర్తించలేదు, పక్కదేశం అతని ప్రతిభను గుర్తించి ఆదరిస్తుంది.

Author:

అతను కష్టాల కడలిలో పుట్టి కష్టాల కడలిలోనే పెరిగాడు. కష్టాల నుండి తనకు తాను నేర్చుకుంటున్న కరాటే కొంచం ఉపశమనం ఇచ్చింది ఇక కరాటే తన జీవితం అనుకున్నాడు. ఎన్నో రాత్రులు నిద్రాహారాలు మాని ప్రాక్టీస్ చేశాడు. తను అడుగుపెడితే చాలు పతకం వచ్చి తీరవలసిందే అనే స్థాయికి చేరుకున్నాడు. ఒక మారుమూల గ్రామం నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి, అంతర్జాతీయ స్థాయిలో 15 స్వర్ణాలు, 13 రజతాలు, 17 కాంస్య పతకాలు మరియు జాతీయ స్థాయిలో 25 స్వర్ణాలు, 12 రజతాలు సాధించిన చాంపియన్ జమీల్ ఖాన్.

kung-fu-champion

ఆదిలాబాద్ జిల్లా , మందమర్రికి చెందిన జమీల్ రోజు స్కూల్లో ఒక రోజు హమీద్ అనే కరాటే మాస్టర్ ప్రోగ్రాం చూసి తాను కూడా నేర్చుకోవాలి అనుకున్నాడు. అలా తాను ఉండే ఊరు నుండి 15 కి.మీ దూరంలో ఉన్న మంచిర్యాలకు రోజు వెళ్లి నేర్చుకునేవాడు. కొన్ని రోజుల తరువాత ఒకవైపు తానూ నేర్చుకుంటూనే తన ఊరిలో పిల్లలకు ఉచితంగా నేర్పడం మొదలు పెట్టాడు. అలా కరాటే లో ప్రాక్టీసు చేస్తూ 1997 లో బ్లాక్ బెల్ట్ సాధించాడు. ఆ తరువాత రాష్ట్ర, దేశ స్థాయిల నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఎన్నో పతకాలను సాధించాడు.

ఇంత సాధించిన జమీల్ ఖాన్ పూట గడవడమే చాలా కష్టంగా ఉండేది అయినప్పటికి పేద విద్యార్దులకు ఉచిత శిక్షణనిచ్చేవాడు. గతంలో ఎన్నో సార్లు అమెరికాలోని వివిద కరాటే అసోషియేషన్లు ఉద్యోగం ఇస్తామన్నా దేశం మీద ప్రేమతో మరియు ఎప్పటికైనా తన ప్రతిభను ప్రభుత్వం గుర్తిస్తుందని వాటన్నింటిని కాదన్నాడు. తనకు సహాయం చేయమని గత 20 సంవత్సరాలుగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలను, క్రీడా శాఖను కోరాడు. వారి నుండి ఎటువంటి స్పందన రాలేదు. ఇక ఈ ప్రభుత్వాలు తనను గుర్తించవు అని తెలుసుకొని తనను ఆదరించిన అమెరికాకు వెళ్ళిపోయాడు. ఈ మధ్యనే న్యూయార్కులోని రికుధిజా కేటీవోసి తరుపున మూడేళ్ళ ఒప్పందం కుదుర్చుకున్నట్టు జమీల్ తెలిపాడు. ఇప్పటికే అమెరికా తరఫున ఒక టోర్నీలో పాల్గొని బంగారు పతకం, రజత పతకం గెలిచాడు.

మన దగ్గర ఉన్న వజ్రాన్ని మనం వాడుకోలేకపోయినప్పుడు దానిని పక్కవాడు వాడుకొని దాని విలువను మరింత పెంచుతూ వారి విలువను పెంచుకుంటున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎందరికో కోట్లలో డబ్బులు కుమ్మరిస్తుంది కదా!. ఇలాంటి పేదవాడికి సరైన సహాయం చేసి ఇక్కడి పిల్లలకు అతనితో కోచింగ్ ఇప్పిస్తే భవిష్యత్ లో మంచి ప్రతిభావంతులైన యువకులను తయారు చేసేవాడు కానీ మన ప్రభుత్వాలు అలాచేయవు కదా!. ఎప్పుడు వారికి వారి బలగం, వారి పార్టీవారే కావాలి లేదా డబ్బు ఉన్నవారికే మళ్ళీ డబ్బు ప్రకటించాలి…. ఇదే ఎన్నో ప్రభుత్వాలు చేస్తున్న పని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చేస్తున్న పని.

(Visited 1,473 times, 1 visits today)