Home / Inspiring Stories / దక్షిణాఫ్రికా లో భారత సంతతి క్రికెటర్ ధారుణ హత్య.

దక్షిణాఫ్రికా లో భారత సంతతి క్రికెటర్ ధారుణ హత్య.

Author:

Nawaz Khan South Africa

మన దగ్గరే కాదు చీకటి ఖండమైన ఆఫ్రికాలో కూడా మూడనమ్మకాలు ఎక్కువే. ఎనగా అభివృద్ది చెందినా మనుషుల నమ్మకాలు మాత్రం పూర్తిగా తొలగటం లేదు. తనకు కొన్ని సమస్యలున్నాయని, వాటి నుంచి బయటపడాలంటే మనిషి తల తీసుకురావాల్సిందిగా మరో భూత వైద్యుడు చెప్పాడని, మానసిక వికలాంగుడని కూడా చూడకుండా  తన స్నేహితుడినే నరికి చంపాడొక వ్యక్తి. ఈ కేసులో పోలీసులు అతడి ప్రాణస్నేహితుడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..

భారత సంతతికి చెందిన నవాజ్ ఖాన్(23) అనే మానసిక వికలాంగ క్రికెటర్‌ను అతడి ప్రాణ స్నేహితుడు,స్థానిక నాటు వైద్యుడూ అయిన తండోవాఖేడుమా(21) తన ఇంటికి సమీపంలో ఉన్న అడవుల్లోకి తీసుకెళ్లాడు. ఆ అడవిలోనే నవాజ్ ఖాన్‌పై కత్తులతో దాడిచేసి తల నరికేశాడు. తనకున్న కొన్ని సమస్యల నుంచి బయటపడటానికి తన గురువుని సంప్రదించాననీ, దానికి ఆయన చేసిన సూచన ప్రకారమే తాను అందుకే తాను స్నేహితుడిని బలిచ్చానని నిందితుడు డుమా పోలీసుల విచారణలో అంగీకరించాడు. అతడే ఘటనా స్థలాన్ని చూపించాడు.ఖాన్‌ను చంపిన తర్వాత, అతని వస్తువులని దోచుకున్నారు డుమా కు సహకరించిన అతని స్నేహితులు.ఆ సెల్ ఫోన్ల ఆధారంగానే వారిని పట్టుకోవటం సాధ్యపడింది.

నవాజ్ఖాన్ మంచి క్రికెటర్ కూడా దక్షిణాఫ్రికాలో మానసిక వికలాంగ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2013 అవార్డును కూడా నవాజ్ ఖాన్ గెలుచుకున్నాడు. తాను ఎంతగానో అభిమానించే హషీమ్ ఆమ్లా నుంచి ఈ అవార్డు అందుకుని చాలా సంబరపడిపోయాడని, అది తన జీవితంలోనే అత్యంత మధుర క్షణమని చెప్పేవాడని నవాజ్ తల్లి జకియా ఖాన్ చెప్పారు. కొద్ది రోజుల్లో నే క్రికెట్ కోసం ఖాన్ తన బృందంతో విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉందని, ఇంతలో ఈ దారుణం జరగడం విచారకరమని దక్షిణాఫ్రికా స్పోర్ట్స్ అసోసియేషన్ అధికార ప్రతినిధి అల్బర్ట్ వార్నిక్ తెలిపారు. ఖాన్ చాలా ప్రతిభగల బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ అని, అతడు చాలా మంది కొత్త ఆటగాళ్లకు మార్గదర్శకంగా ఉండేవాడని మాజీ జాతీయ క్రికెట్ కన్వీనర్ విన్‌స్టన్‌ స్టబ్స్ పేర్కొన్నారు.

(Visited 84 times, 1 visits today)