Home / Inspiring Stories / 40 మంది బందిపోట్లని ఒంటరిగా మట్టికరిపించిన భారత సైనికుడు

40 మంది బందిపోట్లని ఒంటరిగా మట్టికరిపించిన భారత సైనికుడు

Author:

BishnuShrestha

అతనొక్కడే అతను ఎదుర్కోవాల్సింది మాత్రం నలభై మందిని ఏమాత్రం తేడా వచ్చిన్న అతని ప్రణాలు గాల్లోకెగిరిపోవటం ఖాయం కానీ అతను తనప్రాణాలకోసం ఆలోచించలేదు తను కాపాడాల్సిన ఒక అమ్మాయి ఆత్మగౌరవం గురించితప్ప.పట్టా కత్తులూ,వేటకొడవల్లూ చేతిలో పట్టుకున్న ఆ ముష్కర మూక ని ఎదిరించటానికి తన చేతిలో ఉన్న ఆయుదం పెద్దదేం కాదు తన జాతి గుర్తింపుచిహ్నం గా ధరించే ఒక “ఖుర్కీ” (గూర్ఖాలు దరించే చిన్న కత్తి) మాత్రమే. ఒక్కడే నలభై మందితో తలపడ్డాడు అందరినీ ఎదిరించి వారి చేతిలో బలయ్యే అమ్మాయిని కాపాదాడు. ఇదేం తెలుగుసినిమా కోసం తీసిన పోరాట సన్నివేశం కాదు. నిజంగా జరిగిన సంఘటన.న్యాయాన్ని తలకెత్తుకుని పోరాడిన ఒక్కడే గెలుస్తాడని నిరూపించిన నిజ జీవిత సంఘటన.

2 సెప్టెంబర్ 2010 పశ్చిమ బెంగాల్ లోని మయూరా ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న 35 సంవత్సరాల బిష్ణు గూర్ఖా పదాతిదళం లో నాయక్ గా పని చేసి రిటైర్మెంట్ తీసుకొని ఇంటికి వెళుతున్నాడు.అతను ప్రయాణిస్తూన్న మయూరా ఎక్స్ప్రెస్ దట్తమైన అడవిలోకి ప్రవేశించగానే ఆగిపోయింది. ఆవెంటనే పట్టాకత్తులూ,దేశవాళీ కొడవళ్ళతో 40 మంది గుంపు ఆ రైల్లోకి ప్రవెశించింది. ప్రయాణీకులదగ్గరున్న సొత్తునీ,లాప్టాప్ లనీ మిగిలిన వస్తువులనీ దోచుకుంటున్నారు. బిష్ణు అప్పటికీ మౌనం గానే ఉన్నాడు కానీ వాళ్ళు ఆ పెట్టె లోనే ఉన్న 18ఏళ్ళ అమ్మాయిపై అఘాయిత్యానికి తెగబడే సరికి అతని గూర్ఖా రక్తం ఇక అతన్ని మౌనం గా ఉండలేదు. వాళ్ళ దగ్గరున్న ఆయుదాలు గానీ,ఆ గుంపులోని వారి సంఖ్య గానీ అతనికి గుర్తుకు రాలేదు.తన చేతిలో ఉన్న కుర్ఖీ తోనే వాళ్ళమీద కలబడ్డడు మొదటి నాలుగు నిమిషాల్లోనే ముగ్గురిని నరికి పడేశాడు. మిగిలిన వాళ్ళు బిష్ణూ దాటికి తట్టుకోలే క దోచుకున్న సొత్తుతో పారిపోయారు. మొత్తం పోరాటం 20 నిమిషాల పాటు జరిగితే రైల్లో ఉన్న మనుషుల్లో ఒక్కరు కూడా బిష్ణూ కి సాయం గా వెళ్ళక పోవటం గమణార్హం.ఈ పోరాటం లో అరని ఎడం చేయి తీవ్రంగా కత్తి గాటుతో చీరుకు పోయి గాయపడింది. తరవాత వచ్చేస్టేషన్ లో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేసారు. రెండునెలల తరవాత కోలుకునే లోపుగానే పోలీసులు ఆ దొంగల ముఠాని అపహరించ బడ్డ సొత్తు తోసహా పట్టుకున్నారు. కోలుకున్నాక ప్రభుత్వం భిష్ణుని వెండి ఖుర్కీ, 50,000/- నగదుతోనూ సత్కరించింది. అతను కాపాడిన అమ్మాయి కుటుంబం ప్రేమతో ఇవ్వబోయిన నగదు బహుమతిని తిరస్కరిస్తూ “నేనొక సైనికున్ని నా పోరాడటం కాపాడటం నాభాద్యత, దానికి గానూ ప్రభుత్వం నన్ను సత్కరించింది నాకు ఇది మాత్రమే చాలు” అని అన్న మాటలు ప్రతీ ఒక్కరి మనసునీ ఉద్వేగం తో నింపాయి.

(Visited 565 times, 1 visits today)