Home / Inspiring Stories / భారత్ లో మొట్టమొదటి అండర్ వాటర్ రెస్టారెంట్ “పోసీడాన్”

భారత్ లో మొట్టమొదటి అండర్ వాటర్ రెస్టారెంట్ “పోసీడాన్”

Author:

రియల్‌ పొసీడాన్ గ్రీకుల సముద్రదేవుడు అని అర్థం.ఒడెస్సెస్ అనే యుద్ద నావికున్ని ముప్పుతిప్పలు పెట్టిన ఈ దేవుడు గ్రీకు పురాణాల్లో మనకు కనిపిస్తాడు. ఐతే ఈ పోసీడాన్ గురించి ఇప్పుడెందుకంటే అహ్మదాబాద్‌లోని బోపాల్‌ ప్రాంతంలో “రియల్‌ పొసీడాన్” పేరుతో ఫిబ్రవరి 1వ తేదీన ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించారు. మరి పోసీడాన్ అని పేరు పెట్టిననుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది కదా.చుట్టూ నీళ్ళతో నిండి సముద్రగర్భం లో ఉన్న అనుభూతిని కలిగించే ఈ రెస్టారెంట్ కి ఆ సముద్రం పేరే పెట్టారన్నమాట.

Under Water 2

గ్రౌండ్‌ లెవెల్‌కు 20 అడుగుల లోతున ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. 3000 చదరపు అడుగుల్లో నిర్మించిన ఈ హోటల్‌లో 32 మంది ఒకేసారి కుర్చోవచ్చు. 4వేల రకాల చేపలున్న అక్వేరియం, వీటితో పాటు మరిన్ని సముద్రపుజీవులను కలిగి ఉన్న ఈ రెస్టారెంట్ ను లక్షా 50 వేల లీటర్ల నీటితో ఏర్పాటు చేశారు. ఈ అక్వేరియం మధ్యలో గాజు గది నిర్మించి అందులో పొసీడాన్ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. రెండు సంవత్సరాల్లో నిర్మించిన ఈ హోటల్‌ కోసం అయిన ఖర్చెంతో తెలుసా..? 2 కోట్ల రూపాయలు మాత్రమే అయిందట.

‘అండర్‌ వాటర్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కానీ మంచి డిజైన్, కాన్సెప్టు కోసం ఇంతకాలం ఎదురు చూశా. ఈ రెస్టారెంట్‌ భారతీయులందరికీ ఒక కొత్త అనుభూతినిస్తుంది.ముందు రోజుల్లో లైవ్‌ ఆర్కెస్ట్రాతో పాటు మరికొన్ని హంగులను కూడా ఏర్పాటు చేయనున్నాం.’ అని పొసీడాన్ రెస్టారెంట్‌ యజమాని భరత్ భాయ్‌ భట్‌ అంటున్నారు.

Under Water 1

ఈ రెస్టారెంట్‌లో పంజాబీ, థాయ్‌, మెక్సికన్, చైనీస్‌ వంటకాలన్నీ ఉంటాయి.అయితే ఇక్కడో ట్విస్టేమిటంటే చుట్టూ చేపలున్నా మీ ప్లేట్లో చేప కనిపించే అవకాశమే లేదు ఎందుకంటే ఇది పక్కా వెజిటేరియన్ హోటల్ అట. గుజరాత్ కదా అర్థం చేసుకోరూ…

అయితే పోసీడాన్ మన దేశంలో మాత్రమే మొదటి అండర్‌ వాటర్‌ రెస్టారెంట్,అక్వేరియం హోటల్ ప్రపంచంలో ఇప్పటికే ఎన్నో అండర్‌ వాటర్‌ రెస్టారెంట్స్‌ ఉన్నాయి. అయితే నెదర్లాండ్‌లోని క్యాప్సుల్‌ హోటల్‌ మాత్రం మరింత భిన్నమైంది.ముత్యపు చిప్ప ఆకారం లో ఒక బోట్ ని తయారు చేసి దీనిలో అన్ని హంగులను సమకూర్చారు.ఆ రెస్టారెంట్ లో టేబుల్స్ ఉండవు ఇక అన్నీ ఇలాంటి ముత్యపు చిప్ప బోట్లే అన్న మాట. సముద్రం లో తిరుగుతూనే ఉంతుందీ బోట్ హొటల్ అయితే ఇందులో ఒక సారికి ఇద్దరికంటే ప్రవేశం లేదు ఎందుకంటే ఈ హొటల్ సైజు ఏడడుగులే. అయినా ఈ కాన్సెప్ట్ లో బాగానే లాభాలార్జిస్తోందీ హొటల్.

Under Water 3

స్వీడన్‌లోని ‘సాలా సిల్వర్‌మైన’ మరో భిన్నమైన రెస్టారెంట్‌. వరల్డ్‌ డీపెస్ట్‌ హోటల్‌ ఇదే. భూ ఉపరితలం నుంచి దాదాపు 155 మీటర్ల లోతులో ఉంది. ఇక్కడి వాతావరణాన్ని తట్టుకోవడానికి ప్రత్యేకమైన దుస్తులు ధరించాలి. ఈ రెస్టారెంట్‌ పక్కనే ఓ అందమైన సరస్సు కూడా ఉంటుంది.

ఇక అక్వేరియంతో ఉనా రెస్టారెంట్లు ఇంకా చాలా ఉన్నాయి. అయితే మన భారత దేశంలో మాత్రం పోసీడాన్ రెస్టారెంటే మొదటిది.

(Visited 603 times, 1 visits today)