Home / General / నేనే రాజు..నేనే మంత్రి: ఈజిప్టులో కొత్త దేశాన్ని సృష్టించిన భారతీయుడు.

నేనే రాజు..నేనే మంత్రి: ఈజిప్టులో కొత్త దేశాన్ని సృష్టించిన భారతీయుడు.

Author:

ఒక భారతీయుడు ఒక దేశానికి రాజు అయ్యాడు అంటే ఎవరైనా నమ్మగలరా, అది కూడా ఈజిప్టు సరిహద్దులో సరికొత్త దేశాన్ని సృష్టించి ఆ దేశానికి రాజు అయ్యాడు అంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే, ఇంతకీ విషయం ఏంటంటే… ఈజిప్టు సుడాన్ దేశాల సరిహద్దుల నడుమ 2060 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న భూభాగాన్ని మనదేశంలోని ఇండోర్ కి చెందిన వ్యాపారవేత్త సుయాష్ దీక్షిత్ కొత్త దేశంగా ప్రకటించి దానికి రాజుగా తననే ప్రకటించుకున్నాడు.

indore man declares himself king of egypt land సుయాష్ దీక్షిత్ ఈజిప్ట్ ఈజిప్టు

ఈజిప్టు -సుడాన్ మధ్య ఉన్న ఈ స్థలంలో ఉగ్రవాదులు ఆకృత్యాలు ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతం తమది కాదంటే…తమది కాదని ఆ రెండు దేశాలు వాదించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై కన్నేసిన సుయాష్ దీక్షిత్ సుదీర్ఘ ప్రయాణం చేసి బిర్తావిల్ అనే ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్లిన తర్వాత మన సూయాష్ దీక్షిత్.. ఈ భూమి ఏ దేశానికి కాదు కాబట్టి.. నేనే రాజు.. నేనే మంత్రి అని ప్రకటించుకున్నాడు. తన వెంట తీసుకెళ్లిన సన్ ఫ్లవర్ విత్తనాలు ఆ ప్రాంతం అంతా చల్లాడు. విత్తనాలు నేనే చల్లాను కాబట్టి ఇది నా రాజ్యం అని స్వయంగా ప్రకటించేసుకున్నాడు. కింగ్ సుయాష్ వన్ గా రాజ్యానికి నామకరణం చేశాడు. రాజధాని పేరును సుయాష్ పూర్ గా పెట్టాడు. తనకు తాను రాజుగా ప్రకటించుకున్నాడు. తన తండ్రిని ప్రధానమంత్రి, మిలటరీ చీఫ్ గా నియమించాడు. ఈ ప్రాంతంలో జెండా పాతి.. ఇది నా రాజ్యం అంటూ ఏకంగా ఐక్యరాజ్యసమితికి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు.

కొత్త రాజ్యం ఏర్పాటుని పిచ్చోడిగా చూడొద్దని కూడా సలహా ఇచ్చాడు. ఈ రాజ్యానికి బల్లిని జాతీయ జంతువుగా ప్రకటించాడు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇది మాత్రమే కనిపించిందని.. అందుకే దాన్ని ప్రకటించానని తెలిపాడు. ఇప్పుడే వ్యవసాయం మొదలుపెట్టానని.. త్వరలోనే ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్స్ (FDI) తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపాడు. దీని కోసం ఓ వెబ్ సైట్ కూడా తయారు చేశాడు. ఓ రాజ్యం గుర్తింపునకు కావాల్సిన అన్ని డాక్యుమెంట్లతో ఐక్యరాజ్యసమితికి పిటీషన్ పెట్టాడు. ఈ వివరాలను ఫేస్ బుక్ ద్వారా వెల్లడించటంతో ఇది గ్లోబల్ వైరల్ అయ్యింది. అసలే టెర్రరిస్ట్ ఏరియా.. అక్కడ రాజ్యం ఏర్పాటు.. ఈ సుయాష్ ను ఏమనాలి.. ఏమంటారో మీ ఛాయిస్..

(Visited 545 times, 1 visits today)