Home / Inspiring Stories / అక్రమ కరోడ్ పతీ కానిస్టేబుల్

అక్రమ కరోడ్ పతీ కానిస్టేబుల్

Author:

indoreCop

పోలీస్…! అంటే నే అక్రమ సంపాదనకి రహదారి అనే అపవాదు ఎప్పటినుంచో ఉంది. ఎంత కష్టపడ్డా తమకంటూ ఒక మంచి అభిప్రాయాన్ని తెచ్చుకోలేని విభాగల్లో రక్షణ విభాగమైన పోలీస్ వ్యవస్థ ఒకటి. మొన్నటికి మొన్న అక్రమ సంపాదనలో తెలంగాణాకు చెందిన ఒక పోలీస్ బాస్ కోట్ల రూపాయల అక్రమాస్తులతో దొరికాడు. ఐతే వాటిలో తన సొంతానివే కాకుండా రాజకీయాల్లో ఉన్న బందువులవి కూడా అన్న టాక్ వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు లేదా నిజాలని బయటికి రానివ్వలేదు. ఐతే పోలీసుల్లో పెద్ద అధికారీ చిన్న కానిస్టేబుల్ అనే తేడాలు ఉండవూ అని నిరూపించాడు ఒక కానిస్టేబుల్. మధ్య ప్రదేశ్ లోని ఇండోర్కి చెందిన ఈ పోలీసుల వారి ఆస్తులేమిటో, ఎంత ఉన్నాయో చూడండొకసారి.

ఇండోర్‌ నగరంలో 6వేల చదరపు అడుగుల చొప్పున ఉన్న రెండు ప్లాట్లు, ఒక ఫాంహౌస్, వేరే చోట్ల రెండు ఫ్లాట్ల పత్రాలు వాటితోపాటు రేవా నగరంలో మరో 25 ఎకరాల ఫాం హౌస్, 8వేల చదరపు అడుగుల చొప్పున రెండు ప్లాట్లు, ఇక్కడ కూడా మరో రెండు ఇళ్ల డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. అతడి వద్ద నుంచి నాలుగు కార్లు, 8 బ్యాంకు ఖాతాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. చివరికి అతడి ఆస్తుల విలువ రూ. 5 కోట్లుగా నిర్ధారించారు, మార్కెట్ విలువ దానికన్నా ఎక్కువ ఉంటుంది.. జబల్‌పూర్ ట్రాఫిక్ విభాగంలో పనిచేసే అతడి ఆదాయంతో పోలిస్తే ఈ ఆస్తి చాలా రెట్లు ఎక్కువని లోకాయుక్త అధికారులు చెబుతున్నారు. ఇంత ఆదాయం రావటానికి కేవలం లంచాలే అయితే కుదిరే పని కాదు..,మనోడు ఇంకా ఏవేవో చేసే ఉంటాడన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. మరి చివరికి ఈ దొంగ పోలీసు కథ ఏం కానుందో గానీ ఇప్పటికైతే సస్పెండ్ చేసి ర్తిమాండ్లో పెట్టారు.

(Visited 522 times, 1 visits today)