Home / Inspiring Stories / వరంగల్ రానున్న ఇన్ఫోసిస్?

వరంగల్ రానున్న ఇన్ఫోసిస్?

Author:

Infosys

తెలంగాణ ఆవిర్భవించినప్పటినుండి హైదరాబాద్ లో ఐ.టి రంగానికి పునర్‌వైభవం వచ్చింది. విభజన సమయంలో వేరే ప్రాంతాలకి తరలిపోయిన కంపనీలు మళ్లీ హైదరాబాద్ వైపు చుస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ సంస్థ ఇక్కడ అతిపెద్ద(అమెరికా బయట) క్యాంపస్ ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. నిన్న ఇన్ఫోసిస్ సంస్థ కూడా వారి అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్ లో ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విదానం మరియు యంగ్ ఐ.టి మినిస్టర్ కె.టి.ఆర్ కృషి వల్ల ఇప్పుడు ఐ.టి రంగం రెండవ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరించనుంది. ఇందులో భాగంగా నిన్న ఇన్ఫోసిస్ CEO తో మాట్లాడిన ఐ.టి మినిస్టర్ కె.టి.ఆర్, వరంగల్ లో ఇన్ఫోసిస్ బ్రాంచ్ ని ప్రారంభించాలని కోరినట్లు, దానికి ఇన్ఫోసిస్ వర్గాల నుండి సానుకూల సమాధానం వచ్చినట్లు సమాచారం. వరంగల్ లో నిర్మించ తలపెట్టిన క్యాంపస్ లో గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన  ఫ్రెషర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి వారిని మంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీయర్స్ గా తయారుచేయనున్నారు. తొందరగా ఈ కార్యం మొదలైతే ఐ.టి రంగాన్ని రెండవ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరించాలనుకుంటున్న తెలంగాణ సర్కార్ కల సాకారమైనట్లే.

Source: http://gadgets.ndtv.com/others/news/infosys-plans-campus-in-warangal-783550

(Visited 351 times, 1 visits today)