Home / Entertainment / ఇంకొక్క సారి అంటోన్న బేబీ

ఇంకొక్క సారి అంటోన్న బేబీ

Author:

నవ్వుల పాప బేబీ షామిలీ గుర్తుంది కదా. జగదేక వీరుడూ అతిలోక సుందరీ లో ” రాజూ ” అంటూ చిరుని ముద్దుగా పిలిచే పాపని ఇంకా ప్రేక్షకులు మర్చిపోలేదు. ఆ రోజుల్లో ముద్దులొలికే పాపలని ఎంతో మంది బేబీ అని పిలుచుకునేంతగా ఆకట్టుకుంది. పెద్ద పెద్ద స్టార్లతో సమానంగా షామిలీ పోస్టర్లు అమ్ముడుపోయాయి.  అంజలి సినిమాలో బేబీ షామిలీ నటన ఏ గొప్ప ఆర్టిస్ట్ కీ తీసిపోని స్థాయిలో ఉంటుందన్నది ఎవరూ కాదనలేని నిజం. అతి చిన్న వయసులో అంతటి అద్బుత పాత్రని చేసిన ఈ అంజలి పాప. హీరోయిన్ గా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. యంగ్ హీరో సిద్దార్త్ తో చేసిన ” ఓయ్ ” ఫెయిల్యూర్ కి హీరోయినే నే పెద్ద మైనస్ అన్న అపకీర్తిని మూటగట్టుకుంది. సినిమా విడుదల వరకూ అంజలినే హీరోయిన్ అన్న విషయం దాచిపెట్టి ప్రేక్షకులని సర్ప్రైజ్ చేద్దాం అనుకొని సినిమా ఫ్లాప్ అవటం తో తమే పెద్ద షాక్ తిన్నారు నిర్మాతలు. నటనలో శాలినీ ఇంకా మెరుగవ్వాలని అన్నారు సినీ విశ్లేశకులు. కాన్సర్ పేషంట్గా మాత్రం చక్కగా కుదిరిందీ, టీవీ సీరియళ్ళలో ట్రై చేస్తే భవిష్యత్తు అద్బుతంగా ఉంటిందీ అంటూ జోకులు పేలాయి. అలా కథా నాయికగా మొదటి సినిమానే శాలిని కీ చేదు అనుభవాన్ని మిగిల్చింది. కొన్నాళ్ళు తమిళ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోందంటూ వార్తలు వచ్చినా తర్వాత మళ్ళీ ఎక్కడా కనిపించలేదు శాలిని.

అమెరికా వెళ్ళిపోయిందనీ. తనకి పెళ్ళయిపోయిందని కూడా కొన్ని తమిళ సినీ పత్రికల్లో వచ్చింది. షామిలీ లాగానే బాలనటి గా గుర్తింపు తెచ్చుకొని తర్వాత తమిళ సినీ పరిశ్రమలో హీరోయిన్ గా కూడా  కనిపించిన అక్క ” సఖి ” శాలిని తమిళ స్టార్ అజిత్ ని పెళ్ళాడి గృహిణి గా మారిపోయినట్టే థర్డ్ ఇన్నింగ్స్ మొదలు పెట్ట బోతోన్న షామిలీ కూడా నటనకు స్వస్తి చెప్పేసి ఉంటుందనే అనుకున్నారంతా. కానీ షామిలీ ఓటమిని ఒప్పుకోలేదు. తనని తాను మెరుగు  పరుచుకోవటానికి కెనడా వెళ్ళింది అక్కడ మూడేళ్ళ పాటు నటనలొ శిక్షణ తీసుకుంది. సినిమా ల్లో మళ్ళీ గుర్తింపు తెచ్చుకోవటానికి కావలసిన మెళకువలన్నీ నేర్చేసుకుందట. నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనే తపనతో ఇంకోసారి ప్రయత్నించబోతోంది.

ఇండియాకి రావటం తోనే అవకాశాలని అందుకుంది.  ఇప్పటికే కన్నడలో ఒకటీ, విశాల్ హీరోగా తమిళ దర్శకుడు రవికుమార్ తీయబోయే సినిమాకి సైన్ చేసేసిందట ఒకప్పట్టి ఈ ముద్దుల పాప. అవేకాదు పాత తరం హీరో, ఇప్పటి కారెక్టర్ ఆర్టిస్ట్  ప్రభు కుమారుడు వెంకట్ ప్రభు చేయబోయే సినిమా కి కూడ షామిలీనే తీస్కుంటున్నారట. ఐతే ఇంత గ్యాప్ తర్వాత షామిలీకి సక్సెస్ రావటం అనుమానమే అంటూ పెదవి విరుస్తున్నారు ఇండస్ట్రీ జనం. ఈసారైనా అంజలి అనుకున్నది సాధిస్తుందా!? మళ్ళీ తెరమరుగు అవుతుందా అనేది కాలమే తేల్చాలి. రావటం తోనే అవకాశాలను అందుకుంటోన్న ఈ అమ్మడు ఈ ” ముచ్చటగా మూడో ” ఇన్నింగ్స్ లో అయినా సక్సెస్ అందుకోవాలని ఆశిద్దాం. బెస్టాఫ్ లక్ బేబీ షామిలీ.

(Visited 52 times, 1 visits today)