Home / Inspiring Stories / ఊరిని దత్తత తీసుకోని అక్కడి ప్రజల తలరాతను మార్చిన రియల్ హీరోస్ ఈ దంపతులు.

ఊరిని దత్తత తీసుకోని అక్కడి ప్రజల తలరాతను మార్చిన రియల్ హీరోస్ ఈ దంపతులు.

Author:

ఊరిని దత్తకు తీసుకోవడం అనే విషయం ఈ మధ్య వచ్చింది కానీ ఒకవ్యక్తి చాలా రోజుల క్రితం నుండే ఈ పనిని చేస్తుండు. అందరిలా అతను ఎదో ఒక మామూలు ఊరిని దత్తకు తీసుకోలేదు. స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్ళు దాటినా ఇప్పటికి కరెంట్ అంటే ఏమిటో తెలియని ప్రజలు ఉన్నారని ఎంత మందికి తెలుసు. అందుకే అలాంటి ఒక గిరిజన తండాను ఎన్నుకున్నాడు డాక్టర్ ప్రకాష్ బాబా ఆమ్టే. తాను ఎంతో ఉన్నత చదువులు చదివిన, సంపాదించుకోవటానికి అన్ని విధాలా సౌకార్యాలు ఉన్న వాటన్నింటిని వదిలి కరెంట్, పాఠశాల, హాస్పిటల్ సౌకర్యం లేని ఒక మారుమూల గిరిజన తండాలో గత కొన్ని సంవత్సరాలుగా మామూలు గిరిజనులుగా బ్రతుకుతున్నారు డాక్టర్స్ దంపతులు. ఎలాంటి సౌకర్యాలు లేని ఆ తండాను ఇప్పుడు అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాడు డాక్టార్ ప్రకాష్ బాబా ఆమ్టే దంపతులు. అందుకే అక్కడ ఉండే గిరిజనులకు వీరంటే అమితమైన ప్రేమ, గౌరవం. ఇంకా చెప్పాలంటే భక్తి అనొచ్చు. మెగసెసె అవార్డు గ్రహీత అయిన బాబా ఆమ్టే కుమారుడే ఈ డాక్టర్ ప్రకాష్ బాబా ఆమ్టే, ఆయన భార్య మందాకిని ఆమ్టే.

dr-prakash-baba-amte-achievements

1973 సంవత్సరంలో ప్రకాష్ ఎంబిబిఎస్ పూర్తీ చేసి ఎంఎస్ చేస్తున్న రోజుల్లో గిరిజన తండాల అభివృద్ధి కోసం పాటుపడాలని వారి కోసం ఒక ప్రత్యేక లోక్ బిరాదరి ప్రకల్స్ అనే ప్రాజెక్ట్ చేసి అందుకోసం మాహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఉన్న హేమల్ కసా అనే మారుమూల గ్రామాన్ని ఎంచుకొని అక్కడ తనకు కొంత భూమిని ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాడు. ప్రభుత్వం అనుమతి లభించాగానే చేస్తున్న ఎంఎస్ ని కూడా మధ్యలోనే వదిలి భార్యతో సహా ఆ గ్రామనికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళడానికి ప్రకాష్ కు ఎలాంటి సమస్య ఎదురుకాలేదు కానీ అక్కడికి వెళ్లిన తరువాతనే అసలు సమస్య ఎదురైంది. అప్పటికి గ్రామంలో కరేంట్, పాఠశాల, హాస్పిటల్స్ లేవు. అందుకే ప్రకాష్ ఆ తండానూ మూడు విభాగాలుగా అభివృద్ధిచేయాలని అనుకున్నాడు. అందులో ఒకటవది లోక్ బిరాదరి ప్రకల్స్ దవాఖాన( హాస్పిటల్), రెండవది లోక్ బిరాదరి ప్రకల్స్ ఆశ్రమ్ (పాఠశాల), మూడవది ఆమ్టేస్ యానిమ‌ల్ పార్క్‌. అక్కడ ఉండే గిరిజనుల ఆరోగ్యం కోసం హాస్పిటల్ వారి పిల్ల చదువులకోసం పాఠశాల ఏర్పాటు చేయాలనేది ప్రకాష్ యొక్క ముఖ్య ఉద్దేశం. గిరిజనులు ఎక్కువగా వన్యప్రాణులను చంపి వాటిని ఆహారంగా తీసుకుంటున్నారు అందుకే వాటి సంరక్షణకు కూడా ఒక ఆలోచన చేశాడు. తన వద్ద ఉన్న ఆహారాన్ని గిరిజనులకు ఇచ్చి వారికి దొరికిన జంతువులను తాను తీసుకోని వాటిని పెంచేవాడు. అలా మొదలైన ప్రస్థానంతో ఇప్పు అక్కడి వన్యప్రాణుల సంరక్షణకు యానిమల్ పార్క్ ప్రారంబించాడు. ఇప్పుడు ఆ పార్కులో చిరుత పులులు, ఎలుగుబంట్లు, మొసళ్ళు, నెమళ్ళు, కోతులు, కుందేళ్లు, జింకలు, పక్షులు, చాలా ఉన్నాయి. ఇందులో క్రూర మృగాలు ఉండటంతో మొదట్లో భయంగా ఉన్న తరువాత ప్రకాష్ వాటితో సన్నిహిత్యం పెంచుకోవడంతో ఇప్పుడు ప్రకాష్ ఎలా చెబితే అలా ప్రవర్తిస్తాయి ఆ జంతువులు. ఆ తండాలో స్థాపించిన ఆసుపత్రి వలన సంవత్సరానికి 40 వేల స్థానికులకు వైద్యం అందుతుంది. ఇక తాను కట్టించిన పాఠశాలలో ఈ సంవత్సరం 600 మంది పిల్లలు చదువుతున్నారు.
ఇలాంటి సేవ చేసినందుకు గాను ప్రకాష్ ఆమ్టేకు ఎన్నో అవార్డ్స్ వరించాయి. 1984 లో ఆదివాసీ సేవక్ అవార్డు, 2002 లో పద్మ శ్రీ అవార్డు వచ్చింది. 2009 లో గాడ్‌ఫ్రే ఫిలిప్స్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు. 2008 లో ఆమ్టే దంపతులకు ఇద్దరికీ కలిపి రామాన్ మెగసెసె అవార్డు వరించింది. 2012 లో లోకమాన్య తిలక్ అవార్డు, 2014 లో మదర్ థెరిస్సా అవార్డు వచ్చింది. అలాగే ప్రకాష్ బాబా ఆమ్టే జీవితంపై “రియల్ హీరో” అని సినిమా కూడా వచ్చింది. మొనాకో అనే ప్రభుత్వం అయితే ఆయన, ఆయన భార్య మీద ఓ స్టాఫును కూడా విడుదల చేశారు.

” ఇంత సాధించిన ఈ దంపతులు విశ్రాంతి అనేది లేకుండా ఈ జీవితం గిరిజనుల సేవకే అంకింతం అంటున్నారు” . ఇప్పుడు చెప్పండి ఎవరు నిజమైన హీరోలు.

(Visited 658 times, 1 visits today)