Home / Inspiring Stories / 80% అంగవైకల్యం ఉన్న తన కాళ్ళ పై తను నిలబడి అందరికి ఆదర్శంగా నిలిచిన వందన.

80% అంగవైకల్యం ఉన్న తన కాళ్ళ పై తను నిలబడి అందరికి ఆదర్శంగా నిలిచిన వందన.

Author:

మ‌నిషి త‌లుచుకుంటే సాధించ‌లేనిది ఏదీ లేద‌ని, ఏదైనా సాధించ‌డానికి అంగ‌వైక‌ల్యం అడ్డు కాద‌ని నిరూపిస్తోంది రాజ్ కోట్ కి చెందిన వందన. తను పుట్టిన రెండు రోజులకే జాండిస్ వచ్చి 80% శరీరాన్ని అంగవైకల్యంగా మార్చేసింది. ఎన్నో ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులు వందన పరిస్థితి చూసి కన్నీరు పెట్టుకోని రోజు లేదు. వందన ఎదుగుతున్న కొద్ది  తన తోటివారు ఎగురుతూ, ఆడుతూ, పాడుతుంటే  చూసి చాలా భాధపడేవారు వందన అమ్మానాన్న.

vandana story

వందన తనకు చదువుకోవాలని ఉందని వారి తల్లిదండ్రలకు చెప్పడంతో చాలా సంతోషించి స్థానిక పాఠశాలలో చేర్పించారు.  పాఠశాలలో తన చూపులు ఎప్పుడు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలపైనే ఉండేది దానితో చదువులో ఎలాంటి ఇబ్బంది రాకుండానే తన స్కూలింగ్ పూర్తీ చేసింది. వందన కూర్చోవడమే కష్టం మరి అలాంటింది స్కూలింగ్ పూర్తీచేసి డిగ్రీ కూడా చేసింది. అలాగే కంప్యూటర్ కోర్స్ పూర్తీ చేసి ఎవరిపై ఆధారపడకూడదు అనుకోని తానే సొంతగా ఒక ఇంటర్‌నెట్ కేఫ్ ని ఓపెన్ చేయాలనుకుంది. కొందరు నిరుత్సాహపరిచిన, మరికొందరు మాత్రం వెన్నుతట్టి నిలిచారు.

అనుకున్నదే ఆలస్యం ఒక మంచి స్థలం చూసి వందన  ఒక ఇంటర్ నెట్ కేఫ్ ఓపెన్ చేసింది. ఈ కేఫ్ లో అన్ని పనులు…. ప్రింట్స్ తీయడం, డాక్యుమెంట్స్ చేసి ఇవ్వడం, కంప్యూటర్స్  క్లిన్ చేసుకోవడం వంటి పనులు చేసుకుంటూ సింగిల్ గా తన కేఫ్ ని తానే రన్ చేస్తూ కూర్చోలేని స్థితిలో కూడా ఒకరిపై ఆధారపడకుండా తానూ సంపాదిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచింది.

ఈ విషయం పై వందన మాట్లాడుతూ…… కూర్చోలేని స్థితిలో కూడా ఒకరిపై ఆధారపడకుండా సొంతగా ఏదైనా చేయాలని నిర్ణయించుకొని ఈ కేఫ్ ని నడిపిస్తున్నాను. నేను ఈ పని చేస్తున్నాను అంటే దానికి కారణం మా తల్లిదండ్రులు మరియు కొందరి సన్నిహితుల ప్రోత్సహామే  అంటుంది. చెప్పలేదు కాదు వందనకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం.

(Visited 571 times, 1 visits today)