Home / Inspiring Stories / ఐరన్ లెగ్ శాస్త్రి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ టీ వీ ఛానెల్స్ లో కథనాలు.

ఐరన్ లెగ్ శాస్త్రి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ టీ వీ ఛానెల్స్ లో కథనాలు.

Author:

ఐరన్ లెగ్ శాస్త్రిగా సుపరిచితుడైన గునుపూడి విశ్వనాధ్ శాస్త్రి ఫ్యామిలీ ఈ రోజున నా అనే వాడు లేక రోడ్డున పడింది. ఇది చూసి చలించిన నటుడు వెన్నెల కిషోర్ ..ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ తన ఫేస్ బుక్ పేజ్ లో పెట్టిన పోస్టింగ్ కు సాటి నటులు ఔదార్యంతో స్పందించారు. సందీప్ కిషన్, సంపూర్ణేష్ బాబు ఆర్ధిక సహాయం చేస్తున్నట్టు ప్రకటించారు. ఐరన్ లెగ్ శాస్త్రి 150 సినిమాలలో నటించారు. దర్శకుడు ఈ.వి.వి. సత్య నారాయణ, ఈయనని తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేశారు. గునుపూడి విశ్వనాధ్ శాస్త్రి కి 2006 లో గుండె సంభందిత వ్యాధి వచ్చింది. జూన్ 19, 2006 న ఈయన మరణించారు. ఈయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. చివరి రోజుల్లో పచ్చ కామెర్లతో కూడా భాధపడ్డారు.

స్వతహాగా పురోహితుడైన ఐరన్‌లెగ్‌ శాస్త్రి సినిమా రంగానికి రావడం చాలా కాకతాళీయంగా జరిగింది. స్వధర్మాన్ని మానుకుని ఆయన హాస్యనటుడిగా సినిమా రంగానికి వచ్చారు. ప్రేక్షకులకు హాస్యాన్ని పంచి తను మాత్రం విషాదాన్ని తన పెద్ద కడుపులో దాచుకున్నారు. మంచి నటనా సామర్ధ్యం ఉన్నా ఆయన ఐరన్‌లెగ్‌ శాస్త్రి అనే పేరు పడిపోవటానికి కారణం ఆయన నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడమే. శాస్త్రి మరణం తర్వాత ఆయన ఫ్యామిలీ రోడ్డున పడింది. దేవాలయాల్లో ప్రసాదం వండి అతని భార్య , ఇద్దరు పిల్లల్ని పూటగడవని స్థితి లో  చదివిస్తోంది. తినడానికి పట్టెడన్న లేని స్థితిలో పిల్లల్ని చదివించే స్తోమత లేక దీనంగా దాతల సహాయం కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తోందంటూ టీవీ ఛానెల్స్ లో  రావడంతో తెలుగు సినిమా పరిశ్రమ నుండి నటుడు సంపూర్ణేష్ బాబు, సందీప్ కిషన్ స్పందించారు. నటుడు సంపూర్ణేష్ బాబు తన వంతుగా 25వేల సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఇతరులు కూడా వారి కుటుంబానికి సహాయం చేయాలని కోరారు.

(Visited 226 times, 1 visits today)