Home / Reviews / ఇజం రివ్యూ & రేటింగ్.

ఇజం రివ్యూ & రేటింగ్.

Author:

డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరి దర్శకత్వలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘ఇజం’. ఈ సినిమా మొదలుపెట్టిన సమయం నుండి ఎదో ఒక విశేషాన్ని మనకు పరిచయం చేస్తూనే ఉన్నారు చిత్ర టీం. ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ తనను తానూ కొత్తగా మార్చుకొని మన ముందు వచ్చాడు. మరి ఇంత కష్టపడి ప్రేక్షలకుల మనకు దోచుకున్నాడా లేదా! చూద్దాం.

ism-perfect-review-and-rating

కథ:

సత్య( కళ్యాణ్ రామ్) ఒక బాధ్యతగల జర్నలిస్ట్. చిన్నతనంలో తన కుటుంబానికి తీరని అన్యాయం జరుగుతుంది. దోపిడీలు, దొంగతనాలు, పేదలకు, రైతులకు జరుగుతున్నా అన్యాయాలను చూసి తట్టుకోలేక వీటికి కారణమైన రాజాకీయ నాయకులు, దోపిడీదారులు ప్రజల నుండి దోచుకొని, దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకు తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకొని, అందుకోసం మోస్ట్ వంటెడ్ మాఫియా డాన్ అయిన జావేద్ భాయ్( జగపతి బాబు)ను టార్గెట్ చేస్తే కళ్యాణ్ రామ్ అనుకున్న పని జరిగే అవకాశం ఉంటుంది…

మరి కళ్యాణ్ రామ్ జగపతి బాబు ఏవిధంగా టార్గెట్ చేశాడు!? దానికి మధ్యలో హీరోయిన్ పరిచయం కళ్యాణ్ రామ్ కి మంచి జరిగిందా చెడు జరింగింద? చివరికి విదేశాలలో ఉన్న బ్లాక్ మనీని ఇండియాకు ఏవిధంగా తీసుకువచ్చాడు? దానిని పేద ప్రజలకు పంచాడా? లేదా ! అనేది మిగత సినిమా కథ.

అలజడి విశ్లేషణ :

ముందుగా ఇలాంటి సినిమాను ఈ సమయంలో అంటే విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీని ఇండియాకు తీసుకువస్తాం అని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో మన ముందుకు రావడం ఒక మంచి ప్రయత్నం అని చెప్పాలి. .. పనామా పేపర్స్ లీకేజ్ నేపథ్యంలో మన దేశంలో ప్రజలను దోచుకొని సీస్ బ్యాంక్ లలో ఎన్ని కోట్లు దాచుకున్నారు అనే వియోధాన్నాన్ని చాలా చక్కగా చూపించాడు దర్శకుడు పూరి. ఈ సినిమా మొదటి భాగంలో న్యూస్ ఛానళ్లలో జరిగే విధానాలు అన్ని చాలా బాగా చూపించాడు అలాగే అందులో ఉండే కొన్ని లొసుగులను కూడా చాలా బాగా చూపించాడు. ఇంటర్వెల్ ముందు కళ్యాణ్ రామ్ జగపతి బాబుకి ఇచ్చే పెద్ద షాక్ సినిమాపై మరిన్ని అంచానాలు పెంచుతుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి అదిరిపోయే రేంజ్ ఇంటర్వెల్ ముందు సీన్స్ రాలేదనే చెప్పాలి. అక్కడక్కడా మినహా ఫస్టాఫ్ అంత చాలా బాగుంది…

ఇక సెకండాఫ్ లో స్కామ్ కు సంబంధించిన సన్నివేశాలతో పాటు కళ్యాణ్ రామ్, హీరోయిన్ ప్రేమకథను చాలా బాగా చూపించాడు దర్శకుడు. హీరో, హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ కొన్ని బాగున్నాయి. పాటలు కూడా సందర్భానుసారంగా వస్తూ మంచి ఫీల్ ని ఇచ్చాయి. ఇలా సినిమా జరుగుతున్నా సమయంలో అదిరిపోయే ప్రీ క్లైమాక్స్ లో ఎవరు ఊహించని ట్విస్ట్ తో మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశాడు పూరి. ఆ సన్నివేశంలో పూరి రాసిన సోషల్ డైలాగులు, కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్ ఎమోషన్ ను బాగా పండించాయి.

నటీనటుల పనితీరు:

కళ్యాణ్ రామ్: ఇందులో తన లుక్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు. ఈ సినిమా కోసం చాలా బరువు తగ్గి సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. అతని డైలాగ్ డెలివరీ, మ్యానరిజం, ఎమోషనల్ సన్నివేశంలో చూపించిన హావభావాలు చాలా బాగున్నాయి.

జగపతి బాబు: ఎప్పటిలాగే తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేశాడు. కొన్ని సన్నివేశాలలో ముఖ్యంగా కళ్యాణ్ రామ్, జగపతి బాబు బీడీ సన్నీ వేషం చాలా బాగా యాక్ట్ చేశాడు.

అధితి ఆర్య: తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేసిందనే చెప్పాలి. ఎందుకంటే పాటలకు మాత్రమే పరిమితం కాకుండా కొంచం నటనకు అవకాశం ఉన్న పాత్ర అనే చెప్పాలి.

అలాగే తనికెళ్ళ భరణి, గొల్లపూడి మారుతీరావుల యాక్టింగ్ మొదలగు వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం:

ఈ సినిమా విషయంలో ముందుగా చెప్పుకోవలసింది పూరి గురించి. ఎందుకంటే ఒక స్కామ్ కథలో ప్రేమ, యాక్షన్, సెంటి మెంట్, అన్ని సమపాళ్లలో కలిపి మనకు ఒక విందు బొజనంల అందించాడు.. ఇక సంగీతం విషయానికి వస్తే పాటలతోపాటు బ్యాక్ గ్రౌడ్ స్కోర్ కూడా చాలా బాగుంది. మధ్య, మధ్యలో వచ్చే అరుపులు చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.దర్శకుడు ఏదైతే అనుకున్నాడో అది చాలా చక్కగా తెరకెక్కించాడు సినిమాటోగ్రాఫర్. ఎడిటింగ్ కూడా బాగుంది కానీ సెకాండ్ ఆఫ్ లో కొద్దిగా ట్రిమ్ చేసే బాగుండేది.

ప్లస్ పాయింట్స్:

  • కళ్యాణ్ రామ్,జగపతి బాబు,అదితి ఆర్య
  • కథ, కథనం
  • సంగీతం
  • పూరి దర్శకత్వం.

మైనస్ పాయింట్స్:

  • కొన్ని సన్నివేశాలు మనకు ముందే అర్ధం అవడం
  • జగపతి బాబుని మొదట్లో ఒకే రేంజ్ లో చూపించి చివరకు పూర్తిగా వదిలేయడం
  • సెకండాఫ్ లో కొద్దిగా హడావిడిగా ఉండటం

అలజడి రేటింగ్: 3/5

పంచ్ లైన్: ఇది ‘పూరి’ ఇజం.

(Visited 3,497 times, 1 visits today)