Home / Inspiring Stories / రికార్డ్ల మీద రికార్డులు బ్రేక్ చేస్తున్న ఇస్రో.

రికార్డ్ల మీద రికార్డులు బ్రేక్ చేస్తున్న ఇస్రో.

Author:

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగం చేపట్టిన ప్రతిసారి కొత్త కొత్త విజయాల్ని సాధిస్తూ అంతరిక్షంలో భారత దేశ ప్రతిష్టని మరింత పెంచుతుంది, ఈరోజు మరొక ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని నిర్వహించింది, రికార్డుస్థాయిలో తొలిసారిగా పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) రాకెట్‌ ద్వారా 20 ఉపగ్రహాలని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టి అరుదైన రికార్డుని సృష్టించింది, ఈ విజయంతో ఇస్రో మరోసారి దేశం గర్వపడేలా చేసింది.

ISRO Navigation System

ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఇవాళ ఉదయం సరిగ్గా 9.26 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి34 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది, అనంతరం 26 నిమిషాల వ్యవధిలో 20 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యల్లో ప్రవేశపెట్టింది, ఒకేసారి పెద్ద సంఖ్యలో రాకెట్లను పంపడం ఇస్రోకి కొత్తేమి కాదు. 2008లోనే పీఎస్‌ఎల్‌వీ ద్వారా ఒకేసారి 10 ఉపగ్రహాలను పంపింది. 20 శాటిలైట్లలో భారత్‌కు చెందిన కార్టోశాట్‌-2సి, మన దేశ విద్యా సంస్థలకు సంబంధించిన రెండు ఉపగ్రహాలు, అమెరికా, కెనడా, జర్మనీ, ఇండొనేషియాకు చెందిన 17 ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది కార్టోశాట్‌-2సి. దీని బరువు 727.5 కిలోలు. 20 ఉపగ్రహాల మొత్తం బరువు 1,288 కిలోలు. గూగుల్‌కు చెందిన 110 కిలోల స్కైశాట్‌ కూడా వీటిలో ఉంది.

ఉపగ్రహాలు.. ఉపయోగాలు:

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఈ ప్రయోగంలో భాగంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టే ఉపగ్రహాలూ వాటి ఉపయోగాలు చూస్తే..
కార్టోశాట్‌-2సీ: భూమిని నిత్యం పరిశీలిస్తూ (కాంక్రోమేటిక్‌ అండ్‌ మల్టీ స్కెట్ట్రల్‌ కెమెరా ద్వారా) ఛాయాచిత్రాలను తీసి పంపనుంది. పట్టణ, గ్రామీణాభివృద్ధి, తాగునీటి పంపిణీ, తీర ప్రాంత భూముల సమాచారాన్ని కార్టోశాట్‌ అందించనుంది.

సత్యభామశాట్‌: గ్రీన్‌హౌస్‌ వాయువుల సమాచారాన్ని ఈ ఉపగ్రహం సేకరించనుంది. కార్బన్‌ మోనాక్సైడ్‌, కార్బన్‌ డయాక్సైడ్‌, డైఆక్సైడ్‌, మీథేన్‌, హైడ్రోజన్‌ క్లోరైడ్‌ వాయువుల డేటాను సేకరించి పంపనుంది.

స్వయంశాట్‌: ఒక కిలో బరువు కలిగిన ఈ ఉపగ్రహం పాయింటూపాయింట్‌ మెసేజింగ్‌ సర్వీస్‌సను అందించనుంది.

లపాన్‌-ఎ3 (ఇండోనేషియా): భూమిపై సహజవనరుల, వాతావరణ పరిశోధన కోసం ఇండోనేషియా పంపుతున్న ఉపగ్రహమిది.

బీరోస్‌ (జర్మనీ): అంతరిక్షంలో అధిక ఉష్ణోగ్రతలను ఈ ఉపగ్రహం తెలియజేయనుంది.

ఎం-3ఎంశాట్‌ (కెనడా): ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ సంకేతాలను అందించనుంది.

జీహెచ్‌జీశాట్‌ (కెనడా): వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌, మిథేన్‌ వాయువుల సమాచారాన్ని అందజేయనుంది.

స్కైశాట్‌-జెన్‌2-1 (యూఎ్‌సఎ): భూమిని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు జరిగే మార్పులను ఈ ఉపగ్రహం ఫోటోలు హైక్వాలిటీ వీడియోలు తీసి పంపనుంది.

డవ్‌ శాటిలైట్‌ (యూఎ్‌సఎ): ఇవి మొత్తం 12 ఉపగ్రహాలు. కక్ష్యల్లో పావురాల్లా తిరుగుతూ భూమిని పరిశోధిస్తూ భూమిపై జరిగే మార్పులను చిత్రాలుగా తీసి పంపుతాయి. అందుకే ఈ బుల్లి శాటిలైట్‌లకు డవ్‌ (పావురాలు) అని పేరు పెట్టారు.

ఈ ప్రయోగం విజయవంతం కావడంతో దేశం అంత ఇస్రోని ప్రశంసించారు. ఇస్రో కి ముందు ముందు మరిన్ని విజయాలు రావాలని కోరుకుందాం.

(Visited 969 times, 1 visits today)