Home / Latest Alajadi / ర్యాంగింగ్ రక్కసికి మరో ఇంజనీరింగ్ అమ్మాయి బలైంది…!

ర్యాంగింగ్ రక్కసికి మరో ఇంజనీరింగ్ అమ్మాయి బలైంది…!

Author:

అమ్మాయిలపై అఘాయిత్యాలు, వేధింపులు కొనసాగూతూనే ఉన్నాయి. మొన్ననే ఈ మధ్య ఒక లేడి ప్రొఫెసర్ పెట్టిన బాధలను భరించలేక మెడిసిన్ పిజి విద్యార్ధి మరణించిన విషయం మరువక ముందే సీనియర్స్ చేస్తున్న వేధింపులను తట్టుకోలేక మరో అమాయక ఆడపిల్ల బలైంది. అందంగా పుట్టడమే ఆమెచేసిన పాపం, సంప్రదాయబద్ధంగా కనిపించడమే ఆమెకు శాపంగా మారింది. కాలేజీకి వెళ్తే చాలు సీనియర్స్ అందరూ ఆ అమ్మాయి వెంట పడి ర్యాగింగ్ అంటూ గంటల కొద్ది వేధించేవారు. ఇలాంటి వేధింపులు భరించలేక, ఇలాంటి క్రూరమృగాల మధ్య చదువలేక బలవంతంగా ప్రాణాలను తీసుకుంది కడప జిల్లా బద్వేలుకు చెందిన ఉషారాణి.

ragging-death

నంద్యాలలోని RGM ఇంజినీరింగ్ కాలేజీలో ఐటి విభాగంలో మొదటి సంవత్సరం విద్యార్థి ఉష. అందంగా ఉండటంతో కాలేజీలో చేరిన రోజు నుండే సీనియర్స్ ఉష వెంటపడటం మొదలుపెట్టారు. ర్యాగింగ్ పేరుతో గంటల తరబడి వేధించేవారు. ఇలాంటి వాటిని భరించలేక తన స్నేహితులతో ఎన్నో సార్లు తన బాధను పంచుకుంది. కుటుంబ సభ్యులకు ఈ విషయాన్నీ చెప్పడంతో కాలేజీలో కొద్దీ రోజులు సహనంగా ఉంటే తర్వాత అవే సర్దుకుంటాయి అని సర్ది చెప్పారు. ఇలా ఎన్ని సహించిన వేధింపులు రోజు రోజుకు ఎక్కువైయ్యాయి కానీ తక్కువ కాలేదు. ఉష పేరెంట్స్ వచ్చి కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసి కొన్ని రోజులు ఇంటి దగ్గర ఉంటే సర్దుకుంటుందని తీసుకెళ్లారు. అలా 15 రోజులు ఉన్న తర్వాత గత నాలుగు రోజుల క్రితమే మళ్ళీ కాలేజీకి లో వదిలి వెళ్లారు. ఉష కాలేజీకి వెళ్ళగానే మళ్ళీ వేధింపులు మొదలవడంతో ఎదో తెలియని ఆందోళన చెందుతున్నట్టుగా ఉండటంతో కాలేజీ యాజమాన్యం ఉష పేరెంట్స్ కు సమాచారం ఇచ్చారు. కాలేజీకి వెళ్లిన పేరెంట్స్ ఉషను తీసుకోని ఇంటికి బయలుదేరారు. అప్పటికే విషం తీసుకున్న ఉష బద్వేల్ వచ్చే మార్గంలో సృహకోల్పోవడంతో వెంటనే కడపలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి చనిపోయింది. ఇంట్లో, తన స్నేహితులతో నా అందమే నాకు శాపం అయింది అంటూ చెప్పిన చివరి మాటలు ఇప్పుడు అందరిని కంటతడి పెట్టెల చేస్తున్నాయి.


కాలేజీలలో ర్యాగింగ్ లేకుండా చేస్తున్నాం అంటూ ఇటు ప్రభుత్వాలు, కాలేజీ యాజమాన్యం ఎన్ని చెప్పిన దాని మూలంగా బలి ఆయేవారు అవుతూనే ఉన్నారు.పోయిన సంవత్సరం సీనియర్ల ర్యాంగింగ్ కి తట్టుకోలేక రిషితేశ్వరి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, ఇప్పుడు అదే ర్యాంగింగ్ భూతానికి ఉషరాణి బలైంది, ప్రభుత్వం , పోలీసులు సరైన చర్యలు తీసుకోని ర్యాంగింగ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ర్యాంగింగ్ రక్కసికి ఇంకా ఎక్కువమంది బలయ్యే అవకాశం ఉంది.

(Visited 2,191 times, 1 visits today)