Home / Entertainment / సల్మాన్ ఖాన్ తో నటించాలని ఉంది – జగపతిబాబు

సల్మాన్ ఖాన్ తో నటించాలని ఉంది – జగపతిబాబు

Author:

jagapathi babu

జగపతిబాబు ‘సింహస్వప్నం’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యడు. ఈ సినిమా పరాజయం పాలైంది. ఆ తరువాత చేసిన చాలాచిత్రాలు ప్లాపులుగానే నిలిచాయి. కానీ పట్టుదలతో ప్రయత్నించిన జగపతిబాబుకు ‘జగన్నాటకం’, ‘పెద్దరికం’ వంటి చిత్రాల సక్సెస్ తో నటుడిగా గుర్తింపు వచ్చింది. ‘పెద్దరికం’ సినిమాతో రాంగోపాల్ వర్మ దృష్టిలో పడ్డ జగపతి గాయం హిట్ తో హీరోగా స్థిరపడ్డారు. తర్వాత శుభలగ్నం, అంతఃపురం సినిమాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

ఆ మధ్యా జగపతిబాబుకు ఎ సినిమా కలసి రాలేదు ఇకా లాభం లేదు అనుకోని ‘లెజెండ్’ చిత్రంతో ప్రతినాయకుడిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన జగపతిబాబు.., ‘శ్రీమంతుడు’ చిత్రంలో మహేష్ కి తండ్రిగా నటించి మంచి మార్కులు కొట్టేసాడు. ఆ చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి పోటీగా నాన్నకు ప్రేమతో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.  ఆ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న జగపతి బాబు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.

ఇక బాలీవుడ్ కి వెళ్ళే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకి ‘బాలీవుడ్ లో తెలిసిన వాళ్ళు ఉన్నారు కాని ఎలా వెళ్ళాలో తెలియడం లేదని, బాలీవుడ్ లో తన ఫేవరేట్ హీరో సల్మాన్ ఖాన్ అని, అతని సినిమాలో చేయాలనీ ఉందని’ తన మనసులోని మాట చెప్పాడు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ చిత్రాలు తన చిత్రాలకు చాలా దగ్గరి పోలిక ఉంటుందని జగపతి బాబు తెలిపాడు.

(Visited 155 times, 1 visits today)