Home / Inspiring Stories / జై జవాన్…జై కిసాన్..జై విఙ్ఞాన్…జై కలాం

జై జవాన్…జై కిసాన్..జై విఙ్ఞాన్…జై కలాం

Author:

“ప్రజలు..తమ భార్యా పిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టడం కోసమే అవినీతి పరులౌతారు”  అన్న ఒకే ఒక్క కారణంతో పెళ్లినే వదిలేసిన కలాం,”కలలు కనండీ వాటిని నిజం చేసుకోవటానికి శ్రమించండీ” అని చెప్పి తన జీవితాన్నే ఉదాహరణగా చూపిన కలాం..అబ్దుల్ కలాం ఓ    మాటల మాంత్రికుడు.కానీ మాటలతో మభ్యపెట్టలేడు ఒకే ఒక్క మాటతో కుంగిపోతున్న దేశాన్ని నిలబెట్టే  స్పూర్థిని నింపగలడు..  అబ్దుల్‌ కలాం ప్రసంగం వెయ్యి వోల్టుల శక్తిని శరీరంలో నింపుతుంది. నిసత్తువతో ఉన్న జీవితం అక్కడికక్కడే రీఛార్జ్ అవుతుంది. తన దేశాన్ని మాతృమూర్థి కన్నా ఎక్కువగా ప్రేమించి,ఆ దేశపు గౌరవాన్ని నిలబెట్టటం కోసం,ఆ దేశాన్ని రక్షించుకోవటం కోసం అహర్నిషలూ శ్రమించి తాను లేకపోతే తన దేశమేమైపోతుందో అని యువతని సంసిద్దం చేసే పనిలోనే నిమగ్నమై కొన్ని వందల ప్రసంగాలతో యువతకి దిశా నిర్దేశం చేసిన అతికొద్ది మంది మహాను భావులలో ఒకడు.. రామేశ్వరం లో ఒక మధ్య తరగతి ముస్లిం కుటుంబం లో పుట్టిన ఒక కుర్రవాడు  అవుల్ ఫకీర్ జైనుల్లాబ్దీన్ అబ్దుల్ కలామ్ అన్న తన పేరునే సరిగా ఉచ్చరించలేక తడబడ్డ కుర్రవాడు తన పేరు లో డాక్టర్ అన్న పదాన్నీ, భారత రత్న నీ కలుపుకొని తన పేరుని ప్రపంచమంతా ప్రతిద్వనించేలాగా… పేలిన మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అనిపించుకున్నాడు… ఈ రోజు కలాం పుట్టిన రోజు కలాం మనందరిలో బతికే ఉన్నాడు నిరంతరం ఆయన మాటలతో మనలని నడుపుతూనే ఉంటాడు….

(Visited 567 times, 1 visits today)