Home / Inspiring Stories / ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లు వేస్తున్నారు.

ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లు వేస్తున్నారు.

Author:

plastic road

ప్లాస్టిక్ ఒక రకంగా మనకు వరమే గానీ వాడేసిన తరవాత ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల భూమికి జరిగే నష్టం అపారం. కాదనుకోలేని శాపంగా మారిన ప్లాస్టిక్ తేనే పూసిన కత్తిలా మన మెడపై వేలాడుతోంది. వందల సంవత్సరాలు గడిచినా ప్లాస్టిక్‌ పదార్థాలు విచ్ఛిన్నం కాలేవు. నీటిని సైతం కలుషితం చేసి మనిషిని అనారోగ్య కూపంలో నెట్టివేస్తోంది. మనుషులు ప్లాస్టిక్ బాంబుపై కూచుని దానితోనే సహజీవనం చేస్తున్నారంటూ సాక్షాత్తూ భారత దేశ అత్యున్నత న్యాయ స్థానమే వ్యాఖ్యానించిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారత్‌లోని మనిషి ప్రతియేటా సగటున 3 కిలోల ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నాడని, ఈ సంఖ్య యూరోపియన్‌ దేశాల్లో 60 కిలోలు, అమెరికాలో 80 కిలోలు గా ఉంది. దేశంలోని 60 ప్రధాన నగరాల్లో రోజుకు 3,501 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు తయారవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ఈ ఆగస్టులో ఒక నివేదికలో లోక్‌సభకు తెలిపింది. తమకు అందిన సమాచారం మేరకు 2013-14లో దేశంలో ప్లాస్టిక్‌ వినియోగం 11 మిలియన్‌ టన్నులుగా నమోదైందని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ చెప్పారు. 60 నగరాల్లో రోజుకు 3,501 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు పోగవుతున్నాయని అంచనా వేశామని ఆయన అన్నారు.

plastic road in  jamshedpur 1

కొన్నేళ్ళ క్రితం మధురైకి చెందిన కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ ఆర్‌.వాసుదేవన్‌ తన విద్యార్థి బృందంతో కలిసి ఓ విప్లవాత్మకమైన పద్ధతిని రూపొందించారు. పర్యావరణానికి శాపంలా మారిన ప్లాస్టిక్‌తో రహదార్లు వేసేందుకు ఓ ఫార్ములా కనిపెట్టారు, విదేశాల్లో ప్లాస్టిక్‌ మ్యాన్‌గా మన్ననలు అందుకున్నారు. తన ఆవిష్కరణ భారత్‌ను ప్లాస్టిక్‌ కాలుష్య కోరల నుంచి కాపాడుతుందని కలలు కన్నారు.కానీ మనదేశం లోనే ఈ ప్రణాలికని ఇంకా పట్టించుకోవటం లేదు, రీసైకిలింగ్‌కు కూడా పనికిరాని ప్లాస్టిక్‌ను కూడా ఆయన పద్ధతిలో రోడ్ల తయారీకి వాడొచ్చు, ప్లాస్టిక్‌ మిశ్రమాన్ని ఉపయోగించడమే ఈ పద్ధతిలోని ప్రత్యేకత, ఇప్పుడున్న రోడ్డు వేసే విధానాలు యంత్రాల్లో భారీ మార్పులేమి చేయకుండానే ఈ పద్ధతికి అన్వయించుకోవచ్చు లేదా లెగో బ్రిక్స్‌లా ప్లాస్టిక్‌, మెటల్‌లా మిశ్రమంతో పెద్ద ప్లాస్టిక్‌ బ్రిక్స్‌ను తయారుచేసి రోడ్డును పేర్చేయొచ్చు, వీటిని ఊడదీయడం, అతికించడం చాలా తేలిక. చాలా వేగవంతంగా రోడ్డు వేసేయొచ్చు. మరమ్మతుల కోసం ట్రాఫిక్‌ను ఆపేయాల్సిన అవసరమూ లేదు. ఏ భాగం దెబ్బతిన్నదో ఆ భాగాన్నే ఊడబెరికి అక్కడ మరో బ్రిక్‌ను పేరిస్తే సరిపోతుంది. డొల్లగా ఉన్న ఈ ఇటుకల్లో చాలా తేలిగ్గా విద్యుత్‌, సమాచార ఇతరత్రా కేబుళ్లను ఏర్పాటు చేసుకోవచ్చు, తారు రోడ్డు కన్నా తక్కువ ఖర్చుతో రహదారులను వేయొచ్చు.

Plastic Man of india 1

బిటుమెన్‌ రోడ్లు కన్నా అధిక ఉష్ణోగ్రతల్ని, పీడనాల్ని ఇవి తట్టుకుంటాయి, తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా ఇవి దృఢంగా ఉంటాయి. గుంతలు పడే అవకాశం తక్కువ. వాటర్‌ ప్రూఫ్‌ కూడా. నీటి వల్ల దెబ్బతినే అవకాశం అస్సలు ఉండదు. తేలిగ్గా ఉండే ఈ బ్రిక్స్‌ను ఒక చోట నుంచి మరో చోటకు సులువుగా తరలించవచ్చు. పనిచోట వీటిని తయారుచేయాల్సిన అవసరం ఉండదు. తారు రోడ్ల కన్నా మూడు కాలాల పాటు ఇవి మన్నుతాయి. ఒక్కో మోనోబ్లాక్‌ 300 టన్నుల బరువును మోయగలవు. దాదాపు 50 ఏళ్ల పాటు మన్నుతాయి. ప్లాస్టిక్‌ మిశ్రమ బ్రిక్స్‌తో ఓ భారీ రోడ్డు ప్రాజెక్టును చేపట్టింది. ఈ విధానాన్ని భవన నిర్మాణాల్లోను వాడుకోవచ్చని చెబుతున్న వాసుదేవన్‌ భారత్‌లో ఈ సాంకేతికతతో రోడ్లు వేసేందుకు ఏ ప్రభుత్వం ముందుకు వచ్చినా ఉచితంగా సహాయం చేసేందుకు సిద్ధమని చెప్పారు. డీ కంపోజ్‌ అవని ప్లాస్టిక్‌ ఏ రకంగా వదిలించుకోవాలా అని తలలు పట్టుకున్న విదేశీయులకు సరికొత్తగా ప్లాస్టిక్‌ను వాడే టెక్నిక్‌ అందించి ప్రశంసలు పొందాడు…

plastic road in Jamshedpur

ఐతే ఈమద్య జంషెడ్ పూర్ లో జంషెడ్ పూర్యుటిలిటీ అండ్ సర్విసెస్ అనే సంస్థ ఈ పద్దతిని అమల్లోకి తెచ్చింది పట్టణం లోని ప్లాస్టిక్ బాటిళ్ళూ, ఫర్నిచర్ విడిభాగాలూ,ఆఖరికి పాలిథిన్ కవర్లను కూడా కరిగించి రోడ్లు వేయటానికి ఉపయోగిస్తున్నారు.ఈ పద్దతిలోని బిటూమెన్ అనే టెక్నాలజీని వాడి కరిగించిన ప్లాస్టిక్ తో రోడ్లు వేసేస్తున్నరు. ఈ ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ సాయం తో ఇప్పటికే 15 కిలోమీటర్ల రోడ్డుని ప్రయోగాత్మకంగా వేసి చూసారు కూడా. 40 కిలోమీటర్ల వరకూ రోడ్డుని రిపేరు చేసారు. చత్తీస్ ఘడ్,హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు కూడా ఈ పద్దతిని అనుసరించటానికే ఆసక్తి కనబరుస్తునాయట కూడా,నిర్వహణ ఖర్చు తక్కువ,ఇంకా రిపేర్ కూడా చాలా తేలికైన పద్దతి కావటం తో ఈ తరహా పద్దతినే ప్రపంచమంతా అనుసరిస్తే ఈ ప్లాస్టిక్ భూతాన్ని మన ఫ్రెండ్లీ భూతంగా మార్చుకోవచ్చు…

Must Read: GHMC ఎన్నికల ఫలితాలు.

(Visited 1,433 times, 1 visits today)