Home / Entertainment / జణ గణ మణ మార్చే పనిలో దిల్ రాజు..!?

జణ గణ మణ మార్చే పనిలో దిల్ రాజు..!?

Author:

ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా దిల్ రాజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయటానికి  ప్రయత్నిస్తున్న కొత్త సినిమా టైటిల్  ‘ జణ గణ మణ ’ అని నిర్ణయించారన్న సంగతి ఇండస్ట్రీలో ప్రచారమవుతోంది. ఐతే ఇదే టైటిల్ వల్ల కొత్త సమస్యలు రానున్నాయా!? ఈ సినిమా అసలు ఇంకా మొదలవకుండానే కొన్ని అనుకోని న్యాయపరమైన సమస్యల మధ్య చిక్కుకుంటుదా? అంటూ ఫిలింనగర్ లో గాసిప్పుల హడావిడి వినిపిస్తోంది. కారణం మరేదో కాదు ఆ సినిమాకి నిర్ణయించాలనుకుంటున్న టైటిలేనట.

అసలు విషయం ఏమిటంటే  వివాదాల దర్శకుడు 2010లో రాం గోపాల్ వర్మ, బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తో పొలిటికల్ సెటైరికల్ థ్రిల్లర్ గా రూపొందించిన ‘రణ్’ సినిమా గుర్తుంది కదా..! ప్రస్తుత దేశ రాజకీయాల పై సెటైరికల్ గా వచ్చిన ఈ సినిమాలో మధ్యలో భారత దేశ జాతీయ గీతం అయిన ‘ జణ గణ మణ ’ ప్రస్తావన తీసుకు వచ్చినప్పుడు. ఆ సినిమా చుట్టూ వివాదాలు చుట్టుముట్తి వ్యవహారం కోర్టు దాకా వెళ్ళింది. కోర్టుతో చీవాట్లు కూడా వేయించుకున్న వర్మ కే కాదు నటుడు అమితాబ్ కి కూడా ఆ సినిమా చాలా కాలం పాటు తల నొప్పిగానే మారింది.

ఇప్పుడు ఇక్కడ కూడ  అలాంటి సమస్య  జణ గణ మణ విషయం లో తలెత్తే అవకాశాలుండొచ్చనే అనుమానం దిల్ రాజు ని పట్టుకుందట. పవన్ తో సినిమా కోసం ఎంతో కాలంగా ట్రై చేసిన ఈ ప్రొడ్యూసర్ కు ఈ టైటిల్ సినిమా విషయమై అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉందని జాతీయ గీతం పేరు వాడుతూ సినిమాకు టైటిల్ పెడితే సమస్యలు ఎదురవుతాయి అంటూ కొందరు చెప్పారట. అప్పటి వరకూ ఇలాంటి సమస్యని ఊహించని దిల్ రాజు కాస్త కంగారు పడి రాం గోపాల్ వర్మ సినిమా “రణ్” గురించి ఆరా తీసారట కూడా. సినిమా టైటిల్ ఇంకా
అధికారికంగా చెప్ప లేదు కదా మార్పు గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నట్టు వినికిడి. దేశభక్తికి ఎక్కువ ప్రాధాణ్యతనే ఇచ్చే పవన్ అదే దేశభక్తి పై సెటరికల్ గా ఉన్న ఈ టైటిల్ కి ఒప్పుకుంటాడా అనుకున్న అభిమానులకి ఇప్పుడు ఈ తాజా సమాచారం తో మరింత ఆసక్తి మొదలయింది.  సెటైర్లు వేసే సినిమాలో నటించడానికి పవన్ ఎలా ఒప్పుకుంటాడు అంటూ పవన్ వ్యక్తిత్వం తెలిసిన వారు ఈ సినిమా టైటిల్ పై కామెంట్ చేస్తున్నట్లు టాక్. అదీ కాకుండా ఈ సినిమాకు ఒక్క టైటిల్ తప్పించి కథ పూర్తిగా రెడీ కాని నేపధ్యంలో ఈ టైటిల్ కు మంచి అర్ధం వచ్చేలా పవన్ ను దృష్టిలో పెట్టుకుని కథలు రాయమని దిల్ రాజ్ తనకు తెలిసిన రచయితలు అందర్నీ అడుగుతున్నాడని అనుకుంటున్నారు. మరి “జణ
గణ మణ” ఎలా తెరకెక్కుతుందో చూడాలి.

(Visited 205 times, 1 visits today)