Home / Entertainment / జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్ ఫిక్స్…!

జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్ ఫిక్స్…!

Author:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత శ్రీమంతుడు వంటి బ్లాక్ బ్లాస్టర్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం జనతా గ్యారేజ్. ఈ సినిమా మొదలు అయినా నుండి ఇప్పటి వరకు ప్రతి రోజు ఈ సినిమా గురించి ఎదో ఒక వార్తా వస్తూనే ఉంది దానికి కారణం ఎన్టీఆర్ ఒక కారణం అయితే మరో కారణం శివ తీసిన రెండు చిత్రాలు బ్లాక్ బ్లాస్టర్ అవడం.

జనతా గ్యారేజ్

ఈ సినిమా ఆడియో ఎప్పుడు వస్తుందని అని ఎదుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు తీపి వార్తా ఎందుకంటే ఈ చిత్రం ఆడియో ఈ నెల 12 న శిల్ప కళావేదికలో అంగరంగా వైభవంగా జరుగనున్నది. ఈ చిత్రానికి సంగీతం రాక్ స్టార్ డిఎస్పీ కావడం మరో విశేషం. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ లో ఎన్టీఆర్ లుక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయి, అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టెప్పులు కూడా ప్రేక్షకుల మనసు దోచే విధంగా ఉంటాయని నిర్మాతలు తెలియజేసారు. ఈ చిత్రంలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 2 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

(Visited 310 times, 1 visits today)