Home / Entertainment / టీజర్ టాక్: బలహీనుడి బలం..ఈ గ్యారేజ్

టీజర్ టాక్: బలహీనుడి బలం..ఈ గ్యారేజ్

Author:

ఇప్పటికే రెండు బ్లాక్ బ్లాస్టర్ సినిమాలను డైరెక్ట్ చేసిన కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి బిగ్ బ్లాక్ బ్లాస్టర్ ని ఇవ్వాలని ‘జనతా గ్యారేజ్’ సినిమాని మొదలుపెట్టాడు,ఈ సినిమా మొదలు పెట్టకుముందు నుండే అంచనాలు మొదలు అయ్యాయి, ఎన్టీఆర్ కెరీర్ లోనే పెద్ద సినిమా అవుతుందని సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటికే విడుదల చేసిన ‘జనతా గ్యారేజ్’ సినిమా ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది, రంజాన్ సందర్భంగా ఈరోజు టీజర్ ని రిలీజ్ చేశారు, ఈ టీజర్ లో ఎన్టీఆర్ కొత్త లుక్ అదిరిపోయింది,దర్శకుడు కొరటాల శివ ఎప్పట్లానే తన బలమైన కథాంశాన్ని, అంతే బలమైన సంభాషణలతో ఓ కథగా చెప్పినట్లు టీజర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. “బలవంతుడు బలహీనుడ్ని భయపెట్టి బతకడం ఆనవాయితీ.. బట్ ఫర్ ఏ చేంజ్, ఆ బలహీనుడి వద్ద కూడా ఓ బలముంది. జనతా గ్యారెజ్.. ఇచట అన్నీ రిపేర్ చేయబడును” అన్న డైలాగ్‌ను 35 సెకండ్ల టీజర్‌లో తెలివిగా చెప్పుకొచ్చిన స్టైల్ బాగుంది. అలాగే తిరు అందించిన సినిమాటోగ్రాఫీ.. దేవిశ్రీప్రసాద్ కొట్టిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. అన్నీ సూపరంతే. ఓవరాల్ గా మరో యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామా అని తెలిసిపోతోంది ఈ టీజర్ చూస్తే.

(Visited 1,264 times, 1 visits today)