Home / Entertainment / జనతా గ్యారేజ్ విడుదల తేదీ మార్పు.

జనతా గ్యారేజ్ విడుదల తేదీ మార్పు.

Author:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘జనతా గ్యారేజ్’, ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ కి అన్ని వర్గాల నుండి మంచి స్పందన వచ్చింది, ఆడియో ఫంక్షన్ లో ఎన్టీఆర్ కూడా ఎన్నో రోజుల నుండి అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా వస్తుంది అని చెప్పడంతో జనతా గ్యారేజ్ పై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి, ప్రతి సినిమాలో సామాజిక అంశాలకి కమర్షియల్ మెరుపులని జోడించి వరుసగా రెండు సూపర్ హిట్ సినిమాలని తీసి ఇప్పుడు మరోసారి మొక్కలు, మనుషులు అనే కాన్సెప్ట్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి కొరటాల శివ రెడీగా ఉన్నాడు.

juANATHA-gARAGE-RELEASE-PREPONED

సినిమా మొదలుపెట్టినప్పుడు ఆగస్టు 12న సినిమాని విడుదల చేస్తాం అని ప్రకటించి, సినిమా అవుట్ ఫుట్ అద్భుతంగా రావడానికి సెప్టెంబర్ 2 కి వాయిదా వేశారు, కానీ ఇప్పుడు ఒక రోజు ముందుగానే సెప్టెంబర్ 1 నాడే సినిమాని విడుదల చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించారు, నిన్ననే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న యూనిట్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోయారు, సినిమా అవుట్ ఫుట్ అద్భుతంగా వచ్చిందని అందరు అంటుండంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ జనతా గ్యారేజ్ తో ఎన్టీఆర్ మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టడం పక్కా అని సంబరాలకి రెడీ అవుతున్నారు.

(Visited 31 times, 1 visits today)