Home / Entertainment / జనం మెచ్చిన జనతా గ్యారేజ్.

జనం మెచ్చిన జనతా గ్యారేజ్.

Author:

నాన్నకు ప్రేమతో వంటి సూపర్ హిట్ చిత్రం తరవాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రానికి మిర్చి, శ్రీమంతుడు వంటి సూపర్ హిట్స్ అందించిన కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్టీఆర్ సరసన అందాల ముద్దు గుమ్మాలు సమంత, నిత్యా మీనన్ నటిస్తున్నారు. ఈ సినిమా ఆడియో విడుదల నిన్న సాయంత్రం అంగరంగ వైభవంగా  జరిగింది.

ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన విషయం మనకు తెలిసిందే. జనతా గ్యారేజ్ ఆడియోతో పాటు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది.

కొరటాల శివ చాలా గమ్మత్తుగా తన ముందు రెండు సినిమాలు కూడ ట్రైలర్ లోనే సినిమా స్టోరీని మొత్తం చెప్పేశాడు. ఇప్పుడు కూడ అదే చేసాడు. ఎన్టీఆర్ ఈ సినిమాలో మనుషులను ఏవిధంగా ప్రేమిస్తాడో ప్రకృతిని అదే విధంగా ప్రేమిస్తాడు. ప్రకృతిని ధ్వంసం చేసే వారి ఏవిధంగా ఎదురుకొని వారిని అంతమొదించాడు అనేది సినిమా.

ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించడంతో ఈ సినిమా పై చాలా అంచనాలు ఉన్నాయి. అలాగే మలయాళం హీరో ఉన్ని ముకుందన్ విలన్ గా నటించడం జరిగింది. సాయి కుమార్, అజయ్, బ్రహ్మాజీ, బెనర్జీ , జాన్ ,సితార, దేవయాని వంటి ప్రఖ్యాత నటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

(Visited 61 times, 1 visits today)