జానీ మాస్టర్ కు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది మేడ్చల్ కోర్టు. సెక్షన్ 324, 506 కింద 6 నెలల శిక్ష విధించింది. జానీ మాస్టర్ తో పాటు మరో ఐదుగురికి జైలు శిక్ష పడింది. జానీ మాస్టర్ పై 2015 సంవత్సరంలో సెక్షన్ 354, 324, 506 కింద కేసు నమోదు చేయగా.. ఇవాళ దీనిపై తీర్పు వచ్చింది.
సెక్షన్ 354 కేసుని కొట్టివేసి.. 324, 506 సెక్షన్ల కింద నేరం రుజువైనట్లు కోర్టు నిర్దారించింది. దీంతో జానీ మాస్టర్ తో పాటు మరో 5 మందిని జైలుకు తరలించారు పోలీసులు. చెక్ బౌన్స్ కేసుతో పాటు ప్రమాదకరమైన ఆయుధాలతో గాయపర్చటం.. హత్యాయత్నం చేయడం వంటివి ఈ సెక్షన్ల కిందకి వస్తాయి.