Home / Entertainment / రాజమౌళి సార్ కి నా స్టెప్స్ అంటే చాలా ఇష్టం

రాజమౌళి సార్ కి నా స్టెప్స్ అంటే చాలా ఇష్టం

Author:

jatha

నేను హీరో అవ్వాలనేది నా కల.. ఈ రోజు హీరో అయ్యాను అంటే దానికి కారణం మా అన్నయ్యే.. ఆయన లేకపోతే నేను లేను. ఈ సినిమా కథని కూడా మొదట ఆయనే విని చేయమని నాతో చెప్పారు. అలాగే ఆయనే దగ్గరుండి ఈ సినిమా ప్రొడక్షన్ మొత్తం చూసుకున్నారు.. అంటున్నాడు అశ్విన్. జీనియస్’ లో ముగ్గురిలో ఒక్కరిగా ‘రాజుగారి గది’ సినిమాలో హీరోగా మెయిన్ లీడ్ రోల్ చేసిన అశ్విన్ సోలో హీరోగా చేసిన సినిమా ‘జత కలిసే’. తేజస్వి మడివాడ హీరోయిన్ గా నటించిది. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది.

జత కలిసే రోడ్ జర్నీ మూవీ..రాజుగారి గది సినిమాలో నేను చాలా సీరియస్ గా, తక్కువ మాట్లాడుతూ ఉండే పాత్ర చేసాను. కానీ ఇందులో అల్లరి చేస్తూ, అందరినీ నవ్వించే రిషీ పాత్ర చేసాను. ‘శ్రీమంతుడు’, ‘బెంగాల్ టైగర్’, ‘సైజ్ జీరో’ మరియు ‘గబ్బర్ సింగ్’ స్టైల్ స్పూఫ్ లు సినిమాలో కనిపిస్తాయి. ఓవరాల్ గా ఇవన్నీ కలిపి 6 నిమిషాలు మాత్రమే ఉంటాయి, అలాగే బాగా నవ్విస్తాయి. ‘జీనియస్’ సినిమాకి అసోషియేట్ డైరెక్టర్ గా పనిచేసిన రాకేశ్ శశి చెప్పిన లైన్ నచ్చడంతో తనకి చాన్స్ ఇచ్చాం. చాలా మంచి రైటర్, ఫ్రేం టు ఫ్రేం చాలా బాగా చేసాడు. నిర్మాత నరేష్ రావూరి రాకేష్ చిన్నప్పటి ఫ్రెండ్. తనకి సపోర్ట్ ఇవ్వాలని నిర్మతయ్యాడు. అందుకే చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్ గా సినిమాని షూట్ చేసారు.

raja

జత కలిసే ఆడియోకి రాజమౌళి సార్ రావడమే గ్రేట్.. ఆయన నాకు ఆల్ ది బెస్ట్ చెబితేనే చాలు అనుకున్నా కానీ ఆయన రాజుగారి గదిలో ఓ స్టెప్ వేశావ్. చాలా బాగా చేసావ్.. సాంగ్ లో మరోసారి వేస్తావనుకున్నా కానీ వేయలేదు. కానీ యు ట్యూబ్లో మాత్రం ఇప్పటికి 50సార్లకి పైనే చూశానని అన్నారు అని తెలియజేశాడు.

(Visited 95 times, 1 visits today)