Home / Inspiring Stories / కొరియర్ లో మృత్యువు….!?

కొరియర్ లో మృత్యువు….!?

Author:

మీకెప్పుడైనా కొరియర్ వచ్చిందా..!? రాకుండా ఎలా ఉంటుంది గానీ ఇప్పటిదాకా గిఫ్టులో,ముఖ్యమైన పత్రాలో,చెక్కులో,కొన్ని సారు దేవిని ప్రసాదంలో అందుకొని ఉంటారు.. ఆప్యాయంగా తెరిచి అవతలి వారి ప్రేమని అందుకొని ఉంటారు. ఐతే మీరెపుడైనా కొరియర్ లో ఎవరికైనా నా ఒక తేలుని పంపారా,పోనీ ముద్దు గా ఉండే పాముని..!? పోనీ కనీసం కొన్ని దోమలనైనా పంపించారా..? అలా చూడకండి.. నేనూ కెయిత్ డిసిల్వా అనే వ్యక్తి గురించి వినక ముందు ఎవరైనా నన్ను ఇలా అడిగితే మీ లాగే పిచ్చి చూపులు చూసేవాన్ని….

ఇంతకీ సంగతేంటంటే కర్ణాటక కు చెందిన  కెయిత్ డిసిల్వా బెంగులూర్ ఎలెక్ట్రిక్ సప్లై కంపెనీ లో పని చేస్తున్నాడు మొన్నటి మంగళవారం ఉదయమే ఆయనకి ఒక కొరియర్ వచ్చింది. సంతకం పెట్టి ఆ పార్సెల్ ని అందుకున్న డిసిల్వా దాన్ని తెరవబోతూ ఆ పార్సెల్ పైన ఉన్న అక్షరాలని చూసి కొద్దిగా షాక్ తిన్నాడు. అట్ట పెట్టెకి రంద్రాలు చేసి ఉండటమే కాదు “తెరిచేటప్పుడు జాగ్రత్త గా ఉండు” అనే అక్షరాలు ఉన్నాయి. ఐనా కొద్దిగా దైర్యం చేసి ఆ పెట్టెని తెరిచిన డిసిల్వా షాక్ తినటమే కాదు ఒక్క సారిగా కేక పెట్టాడు కూడా ఎందుకంటే ఆ పార్సెల్ లో ఒక మూడడుగుల వైపర్ పాము ఉంది (స్తానిక భాషలో దీన్ని పింజర అంటారు)…

దాన్ని చూసి హడలెత్తి పోయిన కెయిత్ ఆ పాము పక్కనే ఉన్న ఒక లెటర్ని జాగ్రత్తగా తీసుకుని చదివితే అర్థమైంది తన సహ ఉ ద్యోగి భర్తే ఆ కొరియర్ పంపాడని తనకూ అతని భార్యకూ ఉన్న చనువుని అపార్థం చేసుకున్న అతను తన భార్యకు దూరంగా ఉండమని హెచ్చరికగా ఆ పామునూ పంపాడట. దాంతో కెయిత్ కు తిక్క రేగి (మరి కొరియర్ పిల్లాడి ముందు భయపడి పరువు పోయిన భాదలో ఉన్నాడు మరి) సదరు సహోఅధ్యోగి భర్త గరి మీద క్రిమినల్ కేసు పెట్టాడట.. అమ్మొ ఇలా కూడా హెచ్చరికలు పంపుతారన్న మాట ఎందుకైనా మంచిది కాస్త చూసుకొని కొరియర్ పార్సెల్స్ తీస్కోండి బాబూ….

(Visited 161 times, 1 visits today)