Home / Entertainment / కాలుజారటం ఆమెకు కామనే

కాలుజారటం ఆమెకు కామనే

Author:

ఓ హాలీవుడ్ నటి తరచుగా కాలుజారుతూనే ఉంది. అదేమిటో విచిత్రంగా ఇంతకు మునుపు కూడా ఆమె రెండుసార్లు  జెన్నిఫర్  ‘ సిల్వర్ లైనింగ్స్ ప్లేబ్యాక్’ సినిమాకు గానూ 2013లో ఆస్కార్ అందుకుంటూ రెడ్ కార్పెట్ పై జారి పడింది. అలాగే 2014 ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ లోనూ కారులోంచి దిగుతూ కాలు బ్యాలెన్స్ తప్పి కిందపడింది. మళ్ళీ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి హంగర్ గేమ్స్ సినిమా ప్రమోషన్ లో కాలుజారింది. తాజాగా ప్రఖ్యాత రచయిత ‘సుజానే కోలిన్స్’ రాసిన నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా సిరీస్ ‘ద హంగర్ గేమ్స్.. మాకింగ్ జే పార్ట్ 2’ ప్రమోషన్ లో కాలు జారి నటి ‘జెన్నిఫర్ లారెన్స్’ పడిపోయింది.  అందమైన తెల్లని గౌన్ లో మెట్లెక్కుతున్నప్పుడు తడబడిందో లేక హై హీల్స్ బ్యాలెన్స్ తప్పాయో ఆమె పక్కకు పడిపోయింది. ఇంతలోనే తేరుకొని ప్రేక్షకులకు చేయి ఊపుతూ స్టేజి పైకి వచ్చింది.

ఆమెకు దెబ్బలేమైనా తగిలాయా అని ఆ సినిమా నిర్మాత ‘నైనా జాకబ్ సన్’ ను అడగ్గా ఇందులో కొత్తేముంది ఆమెకది అలవాటేగా అంటూ చమత్కరించారు. మళ్ళీ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి హంగర్ గేమ్స్ సినిమా ప్రమోషన్ లో కాలుజారింది. ఇది చూస్తే నిర్మాత చెప్పినట్టు తరచూ కాలు జారటం ఆమెకు అలవాటేనేమో.

(Visited 33 times, 1 visits today)