Home / Entertainment / రామ్ చరణ్ గుండె బంగారం – జానీ మాస్టర్

రామ్ చరణ్ గుండె బంగారం – జానీ మాస్టర్

Author:

Jhani Master and Ram Charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పొగడ్తలతో ముంచేసాడు. చరణ్ మనసు కూడా పవన్ లాగే బంగారమని.., ‘మేము టాలెంట్ ని మాత్రమే వాడుకోమని, ఒక్కసారి నచ్చితే జీవితాంతం భరోసా ఇస్తామని’ చరణ్ చెప్పేవాడని జానీ మాస్టర్ చెప్పుకొచ్చాడు.

జానీ మాట్లాడుతూ ‘నా భార్య 8 నెలల కడుపుతో ఉన్నపుడు తన వద్ద అసలు డబ్బులేదని, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రామ్ చరణ్ కి ఫోన్ చేసి విషయం చెప్పానని, తను వెంటనే అపోలో ఆసుపత్రికి తీసుకెళ్ళమని చెప్పాడు.వెంటనే నా భార్యను అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేశానని, కొన్నిరోజులకు పండంటి బాబుకి నా భార్య జన్మనిచ్చింది. అయితే ఆసుపత్రి ఖర్చు దాదాపుగా 5 లక్షలు అయింది. కాని ఆ ఖర్చు అంతా ఉపాసన చరణ్ చూసుకున్నారని చెప్పుకొచ్చాడు. తనకి రామ్ చరణ్ పెద్దన్న అని రామ్ చరణ్ గుండె బంగారం అని చెప్పుకొచ్చాడు. తనని కష్టాల్లో ఉన్నప్పుడు చాలా ఆదుకున్నాడని చెప్తూ రామ్ చరణ్ సహాయాన్ని జీవితాంతం మరిచిపోలేనని జానీ రామ్ చరణ్ చేసిన సహాయాన్ని గుర్తు చేసుకున్నాడు. తను కేవలం తన బాబుకి 250రూపాయలతో ఒక పాలడబ్బాని మాత్రమే కొన్నానని, ఇలా రామ్ చరణ్ చేసిన సహాయాన్ని తలచుకొని ఉద్వేగానికి లోనయ్యాడు.

(Visited 190 times, 1 visits today)