Home / Entertainment / ‘నాన్నకు ప్రేమతో’ విడుదల డేట్ ఫిక్స్

‘నాన్నకు ప్రేమతో’ విడుదల డేట్ ఫిక్స్

Author:

Nannaku Prematho

యంగ్ టైగర్ ఎన్టీఆర్, విలక్షణ దర్శకుడు సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ‘నాన్నకు ప్రేమతో’ అనే సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్‌తో విపరీతమైన అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్ సినిమాగా నిలుస్తుందంటూ ప్రచారం పొందుతూ వస్తోంది. ఇక సినిమాపై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సుకుమార్ పకడ్బందీగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం విడుదల తేదీని నిర్మాత బీ.వి.ఎస్.ఎన్ ప్రసాద్ అధికారికంగా ప్రకటించాడు. ఇప్పటికే సంక్రాంతికి విడుదల అవుతుందో కాదో అనే సందేహాలు మరియు బాలకృష్ణ ‘డిక్టేటర్’ చిత్రం కూడా సంక్రాంతి బరిలో ఉండటంతో ఆలోచనలోపడ్డ ‘నాన్నకు ప్రేమతో’ చిత్ర యూనిట్ ఇక ఆలస్యం చేయకూడదని జనవరి 13న సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఇటివలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లకు, టీజర్ లకు అభిమానుల నుండి మంచి స్పందన లభించింది. టెంపర్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విజయంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తాని నిరుపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. సంక్రాంతికి విడుదల చేస్తుండటంతో చిత్ర యూనిట్ కూడా సినిమా ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు. డిసెంబర్ చివరి వారంలో ఆడియోని విడుదల చేయనున్నట్లు నిర్మాత బీ.వి.ఎస్.ఎన్ ప్రసాద్ తెలిపారు.

(Visited 106 times, 1 visits today)