Home / Entertainment / నాన్నకు ప్రేమతో శాడిస్ట్.

నాన్నకు ప్రేమతో శాడిస్ట్.

Author:

nannaku prematho release details

ఒక హీరో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయటం అంత ఈజీ కాదు విపరీతమైన స్ట్రెస్ ని మొహం లో చూపించాలి,కోపాన్ని లోపలి నుంచీ రగులుతు ఉన్నట్టు గా ఎక్స్ ప్రెస్  చేయగలగాలి అంతే కాదు హీరో చూపించే శాడిజం ప్రేక్షకుడికి నెగెటివ్గా అనిపించకూడదు రెండో సినిమా పై ఈ పాత్ర ప్రభావం పడకూడదు… ఇన్ని సవాళ్ళాను ఎదుర్కొని ఒక దర్శకుడూ నటుడూ కలిసి చేస్తే తప్ప అటువంటి పాత్ర అద్బుతంగా రాదు ఒకప్పుడు పెద్ద ఎన్ టీఆర్ ధుర్యోదన,రావణ వంటి నెగెటివ్ రోల్స్ చేసి వాటికీ ఒక హీరోఇజం తెచ్చారు. ఐతే ఆయా పాత్రల్లో అప్పటి సమాజానికి ప్రేక్షకులకూ సరిపోయేటంత మాత్రమే నెగెటివ్ షేడ్ కనిపిస్తుంది..

కానీ ఇప్పుడు సీన్ మారింది తాత కాలం అయిపోయి మనవళ్ళ కాలం వచ్చింది మరి ఇప్పుడు నెగెటివ్ హీరో అంటే ఎలా ఉండాలి.. విలన్ గ్యాంగ్ లో ఒక్కొక్కడికీ ఆ రూపం గుర్తొస్తేనే ప్యాంట్లు తడిసిపోవాలి. ఆ చేతికి దొరికి పోతే అన్న ఆలోచనే ప్రాణాభయం కలిగించాలి.అదే… పాత్ర ప్రేక్షకుడి రక్తాన్ని మరిగించాలి, ఒక్కో సీన్ లో రోమాలన్నీ నిక్క బొడుచుకోవాలి మొత్తనికి జూనియర్ ఎంటీఆర్ లా ఉండాలి.విల‌న్‌ల‌ను ఎన్ని ముప్పు తిప్పులు పెడితే… తామే ఆ పొజిష‌న్‌లో ఉన్న‌ట్లు అభిమానులు ఊహించుకుంటారు. హీరో ఎంత శాడిజంతో ఉంటే.. శ‌త్రువులు అంత మెంటల్ ఎక్కిపోతారు. ఇప్పుడు ఇలా త‌న శ‌త్రువుల‌కి త‌న టెంప‌ర్ చూపి శ‌త్రువుల‌కు పిచ్చెక్కించేందుకు సిద్ధ‌మైపోతున్నాడు యంగ్ టైగ‌ర్‌.  సుకుమార్ దర్శకత్వం లో వస్తున్న “నాన్నకు ప్రేమతో” లో జూనియర్ తన నట విశ్వరూపాన్ని చూపించ బోతున్నాడట. ఇందులో యంగ్ టైగర్ ది డ్యూయెల్ రోల్ అన్న సంగతి తెలుసు కదా ఆ ఇద్దరిలో ఒక పాత్ర శాడిస్ట్ లకే శాడిస్ట్ లా ఉంటుందట. ఒక్కొక్కరినీ ఒక్కో పద్దతిలో చిత్ర హింసలు పెట్టెటంత శాడిజం తో పగతో రగిలి పోతుందట ఈ పాత్ర. ఇకనేం మనోడికి ఇలాంటి పాత్రలంటే కొట్టిన పిండి ఇంక యంగ్ టైగర్ చెలరేగి పోయినట్టే అంటూ ఆనంద పడిపోతున్నారు అభిమానులు.

(Visited 54 times, 1 visits today)