Home / Entertainment / మళ్ళీ అదే తప్పు చేసి పట్టుబడ్డ NTR

మళ్ళీ అదే తప్పు చేసి పట్టుబడ్డ NTR

Author:

NTR CAR FINED

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఫైన్ క‌ట్టారు…ఎన్టీఆర్ ఏం త‌ప్పు చేస్తే ఫైన్ ప‌డింద‌ని షాక్ అవుతున్నారా…అదేం కాదు ఆయ‌న కారుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.హైద్రాబాద్ మైత్రివనం వద్ద కార్ నెంబర్…Ap37AX 9999 రేంజ్ రోవర్ కార్లో ప్రయాణిస్తున్న NTR ను పోలీసులు ఆపారు. సుప్రీం కోర్ట్ ఆదేశాల అనుసారం..వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండరాదు. కానీ ప్రయాణిస్తున్న కార్ కు బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో పోలీసులు 700/- పైన్ ను విధించారు. అలాగే ఇదే అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో రూ. 700 జరిమానా విధించినట్లు తెలిసింది. జరిమానాపై ఎన్టీఆర్ సానుకూలంగా స్పందించి ఫైన్ కట్టి వెళ్లిపోయినట్లు సమాచారం. ఎన్టీఆర్ త‌న కారుకు బ్లాక్ ఫిల్మ్ అద్దాలు ఉన్నాయ‌ని పోలీసులు చెప్ప‌గానే వెంట‌నే ఓ స్టార్ అని కూడా ఎలాంటి భేష‌జం లేకుండా ఫైన్ క‌ట్టి వెళ్ల‌డంతో హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు సైతం ఆయ‌న్ను అభినందించారు.

                  గతంలో కూడా ఇదే తప్పు మీద జూనియర్ ఎన్టీఆర్ కారుకు ఫైన్ విధించారని సమాచారం. అయినా జూనియర్ ఎన్టీఆర్ తన వాహనానికి ఉన్న బ్లాక్ ఫిలిం ని మాత్రం తొలగించలేదు. ఇదే చర్య మామూలు వాహన దారుడు చేసి ఉంటే ఈ పాటికి అతని వాహనం పోలీస్ స్టేషన్ లో ఉండేది లేదంటే అధికారులే స్వయంగా ఆ బ్లాక్ ఫిల్మ్ ని తొలగించేవారు. కానీ ఎన్టీఆర్ మాత్రం స్వేచ్చగా చట్టాన్ని ఉల్లంగిస్తూ తిరుగుతున్నారు. నిజానికి ప్రత్యేక పరిస్థితుల్లో సెలబ్రిటీలకు కొంత మినహాయింపు ఇస్తారు అయితే దీనికోసం తమకు మినహాయింపు కోరుతూ అర్జీ పెట్టుకోవాలి. కానీ కనిపించిన ప్రతిసారి నామ మాత్రపు ఫైన్ తో చట్టాన్ని ఉల్లంగించటం సబబేనా? అనే మాటలూ వినిపించినా ఎవరూ పట్టించుకోలేదు…

(Visited 498 times, 1 visits today)