Home / Inspiring Stories / బాలనేరస్తున్ని విడుదల చేయకుండా మమ్మల్ని ఏం చేయమంటారు ?

బాలనేరస్తున్ని విడుదల చేయకుండా మమ్మల్ని ఏం చేయమంటారు ?

Author:

nirbhaya

2012 లో నిర్భయ ఘటన దేశమే కాదు దాదాపు ప్రపంచమే ఈ సంఘటన పట్ల తీవ్ర వేదన పడింది. ఆ నిందితులని అప్పటికప్పుడు చంపేయాలంటూ మండిపడ్డారు. ప్రజలు, యువతరం అంతా ఒక్కతాటి మీదకొచ్చి రోడ్లమీద నిరసన ప్రదర్శనలతో ప్రభుత్వాన్నే వణికిపోయేలా చేసారు. అయితే వీరిలో ఒక వ్యక్తికి మైనార్టీ తీరకపోవడంతో అతనికి జూవనైల్ యాక్ట్ ప్రకారం మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించి జూవనైల్ హోం కు తరలించారు. మరణానికి ముందు నిర్భయ (జ్యోతీసింగ్) ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అందరి కన్నా అతి కౄరంగా ప్రవర్తించింది ఈ “బాలుడే”. నిన్న ఈ “బాల” నేరస్తుడిని విడుదల చేసారు. ప్రస్తుతం అతని వయస్సు 21 సంవత్సరాలు. ఢిల్లీ హైకోర్టు బాంబు పేలుళ్ల నిందితుడు అతన్ని ప్రేరేపించాడని ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో వెల్లడైన నేపథ్యంలో అతనిపై ఎన్ఎస్ఏ (జాతీయ భద్రతా చట్టం) ప్రయోగించాలనీ,అతన్ని బయటికి వదలటం ప్రమాదకరమే అని పోలీసులంటున్నారు.

అతని విడుదల పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న దిల్లిలో నిర్భయ (జ్యోతీసింగ్) తల్లి తండ్రులు ప్రదర్శన నిర్వహిస్తూండగా పోలీసులు వారిని అరస్టు చేసారు, నిరసనలో పాల్గొన్న విద్యార్థులనూ చెదరగొట్టారు. ఎట్టకేలకు అతని విడుదల జరిగిపోయింది, అతన్ని ఒక స్వచ్చంద సంస్థలో ఉంచారు. ఐతే మేజర్ కానంత మాత్రాన (నేరం చేసేనాటికి పద్దెనిమిదేళ్ళు నిండటానికి కొన్ని నెలలు మాత్రమే తక్కువ) అన్ని నేరాల లో లాగా నే ఈ నేరం లో ఉన్న దోషిని విడుదల చేయటం సరి కాదనీ, అతని విదుదల మరికొందరు మైనర్ బాలకుల్లో ఒక ధైర్యాన్ని పెంచుతుందనీ… అతని విడుదలను ప్రశిస్తూ వేసిన పిటీషన్ ను కొట్టేసిన కోర్టు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేసింది. అవేంటో తెలుసా…!?

-మీరు అభ్యర్థించినట్లుగా ఏ చట్టం ప్రకారం మేం ఇంకా అతడిని అదుపులో ఉంచుకోగలం?
-ఈ కేసులో జరిగినవన్నీ చట్టానికి లోబడేజరిగాయి,న్యాయవ్యవస్త ని దాతి మేమేం చేయలేం.
-రాజ్యాంగంలోని 21 నిబంధన ప్రకారం ఒక వ్యక్తి హక్కును కోర్టు హరించలేదు. రాజ్యాంగం ఆ హక్కుని ఎవరికీ ఇవ్వలేదు.
-కోర్టు కి మీ ఆందోళన అర్థం అయ్యింది. కానీ, ఈ కేసులో మూడేళ్లకు మించి బాల నేరస్తుడిని అదుపులో ఉంచుకునేందుకు మన దేశ చట్టం అనుమతించదు.
-ఒక వేళ ప్రభుత్వం ఆ మేరకు చట్టంలో మార్పులు చేసే క్రమంలో ఏడు నుంచి పదేళ్ల సమయం పడితే అప్పటివరకూ అతన్ని ఎక్కడ ఉంచాలి? జైలులోనో, కస్టడీలోనో ఉంచే హక్కు కోర్టుకు కూడా లేదు కదా.. ఆ విధంగా చేసేందుకు మాకు చట్ట అనుమతి ఏది? అని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు అతని విడుదల మీద వేసిన పిటీషన్ ను కొట్టివేసింది. ఈ ఒక్క కేసు గురించి రాజ్యాంగాన్ని మార్చలేమన్న ఉద్దేశంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు.

(Visited 565 times, 1 visits today)