Home / Inspiring Stories / కొత్త జువైనల్ చట్టం లో ఏముంది?

కొత్త జువైనల్ చట్టం లో ఏముంది?

Author:

Juvenile Bill Passed In Parlament

మూడేళ్ళ పోరాటం కొంతలో కొంత ఒక కొలిక్కి వచ్చింది.కౄరమైన నేరాలలో బాలలనే కారణం తో తయారు కాబోయే చీడపురుగులని కాపాడొద్దనే డిమాండ్ అమల్లోకి వచ్చింది. ఎట్టకేలకు బాలనేరస్థుల బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బాలనేరస్తుల వయోపరిమితి రెండేళ్ళు తగ్గించి 16 ఏళ్ళ పైబడినవారు బాల నేరస్తులు కాబోరనే తీర్మానించారు రాజ్యసభ సభ్యులు. లైంగికదాడి, హత్యలు వంటి క్రూరమైన నేరాలకు పాల్పడిన నేరస్థులు ఆ సమయానికి పదహారేండ్ల వయసు కలిగి ఉంటే గనక. వారిపై వయోజనులపై ఎలాంటి విచారణ జరుపుతారో అదే పద్ధతి విచారణ శిక్షా అమలవుతాయి.

2012 లో దేశరాజధాని డిల్లీలో జరిగిన లైంగిక దాడి హత్యా ఉదంతం “నిర్భయ” ఘటనగా దేశాన్నే కాదు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారతదేశంలో ఆడవారికి రక్షణ లేదంటూ యూరోపియన్ మీడియా మనదేశ రక్షణ వ్యవస్త మీద మరోసారి దుమ్మెత్తి పోసింది. అయినా ఆనాటి భయానక ఘటనలో ఇతర దోషులకు ఉరిశిక్ష విధించారు. ఆ సామూహిక దాడి కారకుల్లో అందరికన్నా కిరాతకంగా వ్యవహరించినట్టు ఆరోపణలున్నా.. వయసు తక్కువ అన్న ఏకైక కారణంతో ఒకడిని బాల నేరస్థుడికింద విచారించి, మూడేండ్ల శిక్షతో సరిపెట్టారు.కేవలం పద్దెనిమిదేళ్ళ కన్నా వయసు తక్కువ అన్న కారణంతో అతను అతి తక్కువ శిక్షతో భయట పడ్డాడు. ఆ శిక్షకాలం పూర్తి కావటం తో అతడి ఈ నెల ఇరవైన విడుదలయ్యాడు.ఈ నేపథ్యంలో బాల నేరస్థులుగా గుర్తించే వయసును సవరించాలన్న డిమాండ్ ఉవ్వెత్తున ముందుకు వచ్చింది. మూడేండ్లు శిక్ష ముగించుకున్న బాల నేరస్థుడి విడుదల నేపథ్యంలో పార్లమెంటు తాజా బిల్లును ఆమోదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. బాలనేరస్థుల వయస్సును 18 నుంచి 16కు తగ్గించి వారిపై విచారణ జరిపే అవకాశం కల్పించే బాలనేరస్థుల న్యాయ (బాలల రక్షణ, సంరక్షణ)బిల్లుకు రాజ్యసభ మంగళవారం మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు లోక్‌సభ ఇదివరకే ఆమోదం తెలిపింది. ఐతే ఇప్పటికే పాత చట్టం ప్రకారం శిక్ష అనుభవించిన “నిర్భయ” నేరస్తుడికి మాత్రం ఈ చట్టం వర్తించదు.

అమెరికాలోని కొన్ని రాష్ర్టాల్లో బాలనేరస్థుల వయస్సును తొమ్మిదేండ్లు ఖరారు చేశారని, ఫ్రాన్స్‌లో 12ఏండ్లని, మరికొన్ని దేశాలు 14 ఏళ్లకే పరిమితం చేశాయి. 2012 నిర్భయ గటన పై విచారణ ముగిసిన దగ్గరినించీ ఈ జువైనల్ ఆక్ట్ గురించి మరింత ఎక్కువగా ప్రజల్లో తెలిసింది. అప్పటినుంచే దేశంలో నేరాలకు పాల్పడుతున్న బాలల సంఖ్య వేగంగా పెరుగుతున్నదని ఒక అధ్యయనం చెబుతోందని మేనకా గాంధీ అన్నారు. పిల్లలు పోలీస్‌స్టేషన్లకు వెళ్లి మేము హత్య చేశాము. మమ్మల్ని బాలల సంస్కరణ కేంద్రానికి పంపండి అని ముందే తమకు పడే శిక్ష ఏమిటో వారే చెప్పేసుకున్న సంఘటనలు దాదాపు 15 ఉన్నాయని ఆధారాలు చెప్తున్నాయి.. కేవలం ఢిల్లీలోనే ఒక్క ఏడాదిలో ఇటువంటి నేరాలకు పాల్పడి అరెస్టయిన 16 ఏండ్ల వయస్సు బాలలు వెయ్యి దాటారని చెప్పారు. అయితే అసలు ఇప్పుడు సవరించిన బిల్లులో ఏం ఉంది. సీతారాం ఏచూరి అనంట్టు నిజంగా దీని వల్ల బాలల హక్కులకు భంగం కలుగుతుందా? అన్ని విశయాన్ని చూస్తే సవరించిన బిల్లులోని అంశాలను కింద చూడవచ్చు….

-ప్రస్తుత జువెనైల్ జస్టిస్ (బాలల సంరక్షణ) చట్టం, 2000 స్థానంలో ఈ సవరణ తో కూడిన తాజా చట్టం అమలులోకి వస్తుంది. ఈ చట్టం ప్రకారం 16 ఏండ్లు దాటిన బాలలు కౄరమైన నేరాలకు పాల్పడ్డట్టు ౠజువైతే వారిని బాలలుగా కాక వయోజనులుగానే పరిగణించి అదే పద్దతిలో విచారణ జరుపుతారు.

-దేశంలోని ప్రతి జిల్లాలో జువెనైల్ జస్టిస్ బోర్డు (జేజేబీ), బాలల సంక్షేమ కమిటీని ఏర్పాటు చేస్తారు.

-బాల నేరస్థుడిని పరివర్తన కేంద్రానికి పంపాలా లేక వయోజనునిగా పరిగణించి విచారణ జరపాలా?అన్నది జువెనైల్ జస్టిస్ బోర్డు నిర్ణయిస్తుంది.

-సాటి బాలల పట్ల క్రూరంగా వ్యవహరించిన, మత్తుమందులు ఇవ్వజూపిన, లేక పిల్లలను అపహరించడం లేదా అమ్మకం జరిపిన బాలలకు జరిమానా విధిస్తారు.

-ఈ బిల్లు ప్రకారం బాల నేరస్థులెవరూ నేరుగా జైలుకెళ్లరు.జరిగిన నేరం పిల్లచేష్టనా లేక అన్నీ తెలిసి చేశారా అన్న అంశాన్ని జువెనైల్ జస్టిస్ బోర్డులోని నిపుణులు, మానసిక వైద్యులు నిర్ధారిస్తారు.

-వయోజనుల జైలుకే వెళ్లాలని కోర్టు ఆదేశించినా, దానిని సవాలుచేసే హక్కు బాల నేరస్థులకుంటుంది.

-బాల నేరస్థులకు జైలుశిక్ష పడితే, వారికి 21 ఏండ్ల వయస్సు వచ్చే వరకు వారిని బోస్టల్ (ప్రస్తుతం మన దేశంలో లేవు. త్వరలో వాటిని ఏర్పాటు చేస్తారు)కు పంపుతారు. ఆ తరువాత వారి ప్రవర్తనపై సమీక్ష జరుపుతారు. అప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాకపోతే పూర్తికాలం శిక్ష అనుభవించాలి.

(Visited 312 times, 1 visits today)